ఇద్దరి హీరోల్లో ఎవరు బాగా చేసారు…

ఎన్టీఆర్, చెర్రిలలో ఎవరు బాగా…

ఇద్దరి హీరోల్లో ఎవరు బాగా చేసారు అంటే.. ఇద్దరూ ఒకరికొకరు పోటీ పడి చేసారు. దర్శకుడుగా రాజమౌళికు ఈ ఇద్దరితో చేసిన అనుభవంతో వాళ్ల బలాలు,బలహీనతలు తెలుసు. వాటిని దృష్టిలో పెట్టుకుని సీన్స్ డిజైన్ చేయటంతో ఫెరఫెక్ట్ గా ఆ పాత్రలకు మ్యాచ్ అయ్యారు. ఎన్టీఆర్ పాత్ర కాస్త ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే కథకు ఎమోషన్ ఆర్క్ ఇచ్చేది ఆ పాత్రే కాబట్టి. ఇక ఎన్టీఆర్ ఇంట్రో, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ కొమరం భీముడో సీక్వెన్స్ ఎన్టీఆర్ ని నెక్ట్స్ లెవిల్ లో చూపెడతాయి.అలాగే తన ఎదురుగా ఉన్న మరో స్టార్ ని నటనతో తినేయకుండా బాలెన్స్ చేసుకుంటూ ఎన్టీఆర్ ముందుకు వెళ్లారు. ఫస్టాఫ్ ఎన్టీఆర్ విశ్వరూపం చూపిస్తే..సెకండాఫ్ రామ్ చరణ్ తనేంటో ,తన కెపాసిటీ ఏంటో చూపిస్తే ముందుకు వెళ్తారు. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ కథలోంచి తీసుకుని ..చాలా బాగా డిజైన్ చేసారు. ఆ విధంగా చూస్తే ఎన్టీఆర్ ఇంట్రడక్షనే కాస్త సినిమాటెక్ గా అనపిస్తుంది. కానీ చాలా బాగుంది. హై మూమెంట్స్ కూడా ఇద్దరికి ఫెరఫెక్ట్ గా షేర్ చేయటంతో ఇద్దరిలో ఒకరే బాగా చేసారని ఎక్కడా చెప్పలేని విధంగా ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్ కు ఈ ఇద్దరి హీరోలను తప్పించి వేరే వాళ్లను ఊహించుకోలేమన్నట్లుగా ఉంది.