RRR, సలార్ రికార్డు బ్రేక్ చేసిన గుంటూరు కారం..

మహేష్ బాబుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ మార్కెట్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన సినిమా ఓపెనింగ్స్ తోనే సగం బడ్జెట్ ని రికవరీ చేసేస్తారు. ఇక ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో గుంటూరు కారం అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. కాగా మహేష్‌కి మన తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా భారీ ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ వస్తాయి. అక్కడ అత్యధికంగా వన్ మిలియన్ మార్క్ ని అందుకున్న హీరోగా మహేష్ కి ఓ రికార్డు ఉంది. ఇప్పుడు మరో రికార్డుని కూడా సృష్టించారు.
గుంటూరు కారం చిత్రానికి అమెరికాలో అత్యధిక ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. దాదాపు 5408 పైగా స్క్రీన్స్ లో గుంటూరు కారం ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఇది ఆల్ టైం రికార్డు, ఎందుకంటే గతంలో రిలీజ్ అయిన RRRకి 3800 పైగా, సలార్‌కి 2450 పైగా ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. కానీ గుంటూరు కారం ఒక రీజినల్ మూవీ. దానికి ఈ స్థాయిలో ప్రీమియర్స్ పడడం.. నిజంగా మహేష్ మ్యానియా అనడంలో ఏ సందేహం లేదు..

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ఆరంభంలోనే హైప్‌ను క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి..అలాంటి వాటిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ మూవీ ఒకటి. అంతలా ఈ చిత్రం అంచనాలను ఏర్పరచుకుని ఈరోజే గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ‘గుంటూరు కారం’ మూవీ టాలీవుడ్‌లో సరికొత్త చరిత్రను సృష్టించింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!..

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇచ్చాడు..
వరల్డ్ వైడ్‌గా అదే ఊపుతో

ప్రకటన సమయం నుంచే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ‘గుంటూరు కారం’ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వేల సంఖ్యలో విడుదల చేశారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకుల గోలతో దద్దరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లన్నీ నిండిపోయాయి. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఊపును చూపిస్తోంది..

హైదరాబాద్‌లో రికార్డుతో

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో సాధారణ రెస్పాన్స్‌ను అందుకుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇది భారీ స్పందనతో దూసుకుపోతోంది. ఇలా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే హైదరాబాద్ నగరంలో మహేశ్ బాబు చిత్రం రూ. 11.20 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

RRR రికార్డు బ్రేక్ చేసేసి

‘గుంటూరు కారం’ మూవీ హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలోనే గతంలో ‘RRR’ మూవీ పేరిట ఉన్న రూ. 10.90 కోట్లు రికార్డును బ్రేక్ చేసేసింది. ఈ లిస్టులో ప్రభాస్ నటించిన ‘సలార్: సీజ్‌ఫైర్’ రూ. 10.56 కోట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ రికార్డుతో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.