స్వల్పంగా ఛార్జీల పెంపు తప్పదు… పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడమే కారణం..: ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి

బస్సు చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్‌‌కు రెండు నెలల క్రితం ఫైల్ పంపామని, అది ఇంకా పెండింగ్‌లో ఉండడంతో ఇవాళ మరోసారి రివ్యూ చేసి మరోసారి ప్రతిపాదనలు పంపామని ఆయన చెప్పారు. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందని తెలిపారు. డీజిల్ పై కేవలం ఒక్క శాతం మాత్రమే కేంద్రం తగ్గించిందన్నారు. చార్జీల పెంపుతో పల్లె వెలుగు లాంటి బస్సులపై పెద్దగా భారం ఉండకున్నా, దూరప్రాంతాలకు వెళ్లే బస్సులకు చార్జీలు కొంత పెరుగుతాయన్నారు బాజిరెడ్డి..ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు ప్రతిపాదనల ఫైల్‌ను సీఎం కేసీఆర్‌‌కు ఆర్టీసీ అధికారులు పంపారు. పల్లె వెలుగుకు కిలోమీటర్ కు 25 పైసలు, ఎక్స్ ప్రెస్ ఆపైన బస్సులకు కిలోమీటర్ కు 30 పైసలు పెంచాలని అధికారులు నిర్ణయించారు. సిటీ ఆర్డినరీ బస్సులకు కిలోమీటర్‌‌కు 25 పైసలు, మెట్రో ఎక్స్ ప్రెస్, ఆపై సర్వీసులకు కిలోమీటర్‌‌కు 30పైసలు పెంచాలని ప్రపోజల్స్ రెడీ చేశారు. ఆర్టీసీపై మంత్రి పువ్వాడ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులతో చర్చించి.. ప్రతిపాదనలు ఫైనల్ చేశారు. సీఎం దగ్గరకు ఫైల్ పంపారు. సీఎం ఆమోదం పొందిన వెంటనే ఆర్టీసీ చార్జీలు పెరిగే అవకాశం ఉంది అన్నారు.