గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపకపోవడంపై ఆర్టీసీ ఉద్యోగుల నిరసన..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపలేదు..! దీంతో ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక బిల్లు కావడంతో ప్రభుత్వం దానిని గవర్నర్‌కు పంపింది. అయితే ఈ బిల్లుకు రాజ్‌భవన్‌ నుంచి ఆమోదం లభించలేదు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత నెల 31న జరిగిన తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసింది. ఈ మేరకు ఈ నెల 1న బిల్లు రూపొందించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది..

ఉదయం 6 గంటల నుంచే డిపోల ముందు ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. నల్ల బ్యాడ్జీల ధరించి నిరసన తెలిపారు. దీంతోబస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్మికుల ధర్నాతో ఉదయం 6 నుంచి 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాగా, రాజ్‌భవన్‌ ముట్టడికి తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (TMU) పిలుపునిచ్చింది..
ఉదయం 9 గంటలకల్లా ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లోని నెక్లెస్‌ రోడ్డుకు చేరుకోవాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌ ముట్టడికి బయలుదేరుతామని చెప్పారు. ఎలాంటి సాగదీతలు లేకుండా వెంటనే ఆర్టీసీ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేశారు.

నల్లగొండ జిల్లా

మిర్యాలగూడ లో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఫైల్ ను గవర్నర్ ఆమోదించాలని ఆర్టీసీ డిపో ముందు నిరసన వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మికులు…..

దేవరకొండ ఆర్టిసి డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగస్తుల ధర్నా..తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని క్యాబినెట్లో ఆమోదిస్తే
తెలంగాణ గవర్నర్ సౌందర్య రాజన్ ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ డిపో ముందు ధర్నాకు దిగారు ఉద్యోగులు..

యాదాద్రి జిల్లా…..
యాదగిరిగుట్ట
అర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడం కోరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టడానికి అనుమతి కొరగా అమోదించకపోవడాన్ని నిరసిస్తూ నిరసన తెలిసిన అర్టీసి కార్మికులు……

*సూర్యాపేట జిల్లా :……….

ఆర్టీసీ విలీనం బిల్లుపై సంతకం చేయకుండా గవర్నర్ తమిళసై చేస్తున్న జాప్యం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సూర్యాపేట ఆర్టీసీ డిపోలో బస్సులను నిలిపివేసి నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపిన ఆర్టీసీ ఉద్యోగులు…

కోదాడ

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని క్యాబినెట్లో ఆమోదిస్తే
తెలంగాణ గవర్నర్ సౌందర్య రాజన్ ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ కోదాడ ఆర్టీసీ డిపో ముందు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిరసన కార్యక్రమం చేపట్టిన ఆర్టీసీ ఉద్యోగులు..