బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో టీఎస్,ఆర్టీసీ నిర్వహిస్తోన్న లక్కీ డ్రా బుధవారం నుంచి ప్రారంభంకానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30 వరకు ఇది కొనసాగుతుందని ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ తెలిపారు.
టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్‌ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో ప్రయాణికులు వేయాలని ఆయన సూచించారు.
బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు.
*ప్రతి రీజియన్ కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు*
ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బహుమతులను సంస్థ అందించనుంది. ప్రతి రీజియన్‌కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్తం 110 మందికి ఒక్కొకరికి రూ.9900 చొప్పున బహుమతులను ఇవ్వనుంది.
బతుకమ్మ, దసరా పండుగలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రాఖీ పౌర్ణమి మాదిరిగానే ఈ లక్కీ డ్రా సదుపాయాన్ని వినియోగించుకొని సంస్థను ఆదరించాలని అధికారులు కోరారు…