రైతు రుణమాఫీ సాంకేతిక సమస్యలపై బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి హరీష్‌ రావు అధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష….

రైతు రుణమాఫీ సాంకేతిక సమస్యలపై బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి హరీష్‌ రావు అధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష..

* ఇప్పటి వరకు 18 లక్షల 79 వేల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9654 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది.

* 17 లక్షల 15 వేల మందికి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో చేరాయి.

* సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.6 లక్షల మందికి ఇంకా రుణ మాఫీ కాలేదు. వీరికి వెంటనే అందజేయాలి.

బ్యాంకు ఖాతాలు పనిచేయక పోవడం, అకౌంట్లను క్లోజ్‌ చేయడం, అకౌంట్‌ నంబర్లను మార్చడం, బ్యాంకుల విలీనం అనే నాలుగు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తినట్టు వివరించిన అధికారులు. చర్చించిన అనంతరం మూడు పరిష్కార మార్గాలు గుర్తింపు.

* ఆధార్‌ నంబర్ల సాయంతో రైతు బంధు ఖాతాలను గుర్తించి ఆ ఖాతాల్లో రుణ మాఫీ డబ్బు వేయడం, దీని వల్ల సుమారు మరో లక్ష మందికి రుణ మాఫీ డబ్బు అందుతుంది.

* ఎన్‌.పీ.సీ.ఐ సాయంతో బ్యాంకులు రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించి ప్రభుత్వానికి అందజేయాలి. వారికి ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తుంది. ఇలా దాదాపు 50 వేల మందికి మూడు రోజుల్లోగా డబ్బు వేయాలని నిర్ణయం.

* మిగతా 16వేల మంది వివరాలను కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో వివరాల