ఫిఫా ప్రపంచకప్‌ 2022 నుంచి రష్యా బహిష్కరణ..అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) నిర్ణయం…

ఫిఫా ప్రపంచకప్‌ 2022 నుంచి రష్యాపై బహిష్కరణ వేటు వేసింది అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ).. అన్ని అంతర్జాతీయ టోర్నీల నుంచి రష్యాను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని వెల్లడించింది. దీంతో.. రష్యాకు క్రీడలపరంగానూ భారీ దెబ్బ తగిలినట్టు అయ్యింది.. అంతర్జాతీయ టోర్నీల్లో రష్యన్‌ జట్లను అనుమతించొద్దని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ స్పష్టం చేసింది.. అంతే కాదు.. రష్యాకు మద్దతు తెలుపుతున్న బెలారస్‌ అథ్లెట్లను కూడా బహిష్కరించాలని పేర్కొంది. ఆ రెండు దేశాలకు చెందిన అథ్లెట్లను టోర్నమెంట్‌లలో ఆడకుండా చేయాలని సమావేశంలో ఐవోసీ నిర్ణయం తీసుకుంది. రష్యా, బెలారస్‌పై ఎందుకు బహిష్కరణ వేటు వేయాల్సి వచ్చింది వివరిస్తూ.. ప్రపంచ క్రీడా పోటీల సమగ్రతను కాపాడేందుకు.. క్రీడాకారుల భద్రత కోసం ఈ చర్యలు తీసుకోవాలి అని ఐవోసీ పేర్కొంది. ఉక్రెయిన్‌పై దాడితో బరువెక్కిన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.. అంతర్జాతీయ పోటీలలో రష్యన్ మరియు బెలారస్‌ అథ్లెట్లు మరియు అధికారులను ఆహ్వానించవద్దని లేదా అనుమతించవద్దని అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు మరియు స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వాహకులకు ఐవోసీ సిఫార్సు చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మరోసారి చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది.. సంస్థాగత లేదా చట్టపరమైన కారణాల వల్ల చిన్న నోటీసుతో ఇది సాధ్యం కానప్పుడు, అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు మరియు ప్రపంచవ్యాప్తంగా క్రీడా ఈవెంట్‌ల నిర్వాహకులను రష్యా లేదా బెలారస్ నుండి ఏ అథ్లెట్ లేదా స్పోర్ట్స్ అధికారిని అనుమతించకుండా చూడాలని కోరింది.. రష్యన్ లేదా బెలారసియన్ జాతీయులు, అది వ్యక్తులు లేదా జట్లుగా అయినా, తటస్థ క్రీడాకారులు లేదా తటస్థ జట్లుగా మాత్రమే అంగీకరించబడాలి.. జాతీయ చిహ్నాలు, రంగులు, జెండాలు లేదా గీతాలు ప్రదర్శించబడకూడదని ఐవోసీ స్పష్టం చేసింది..