రష్యా దాడులకు దీటుగా ఉక్రెయిన్ ప్రతి దాడులు..సుమారు 3,500 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా వెల్లడి…
రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం సరిహద్దుల్లో రణరంగంగా మారింది. చర్చలు అంటూనే ఉక్రెయిన్ ను ఆక్రమించుకకునేందుకు ప్రయత్నం చేస్తోంది రష్యా… కానీ రష్యా దాడులకు దీటుగా ప్రతి దాడులు చేస్తూ.. హోరాహోరి పోరాటాన్ని సాగిస్తోంది ఉక్రెయిన్.
ఉక్రెయిన్‌ను మొత్తం స్వాధీనం చేసుకునే విధంగా ముందుకు కదులుతుంది రష్యా.. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు పరిపోయినట్టు వార్తలు వచ్చినా.. తాను ఎక్కడి పోలేదు.. ఇక్కడే ఉన్నా.. పోరాటం చేస్తా.. తనకు ఆయుధాలు కావాలంటూ ఓ వీడియో విడుదల చేశారు. అయితే, ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు అంత సులువుగా ముందుకు సాగిపోతున్న పరిస్థితి ఏమీ లేనట్టుగా తెలుస్తోంది.. ఉక్రెయిన్ ఎదురుదాడిలో రష్యాకు కూడా భారీ నష్టమే జరుగుతోంది..సుమారు 3,500 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.. అంతే కాదు.. మరో 200 మంది రష్యా సైనికుల్ని అందుపులోకి తీసుకున్నామని పేర్కొంది.. మరో 14 విమానాలను, 8 హెలికాప్టర్లను, 102 యుద్ధ ట్యాంక్‌లను కూడా రష్యా కోల్పోయిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. కానీ, దీనిపై రష్యా నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు.. రష్యా రక్షణ శాఖపై సైబర్ ఎటాక్ జరిగిందని.. సైనికులతో పాటు ఇతర రక్షణశాఖ ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం హ్యాక్ చేశారనే ప్రచారం సాగినా.. ఆ వార్తలను రష్యా రక్షణ శాఖ ఖండించిన విషయం తెలిసిందే..