ఉక్రెయిన్‌లోని నాలుగు భూభాగాలు రష్యాలో విలీనమయ్యాయి…

ఉక్రెయిన్‌లోని నాలుగు భూభాగాలు శుక్రవారం రష్యాలో విలీనమయ్యాయి. జపోరిజియా, ఖేర్సన్‌, లుహాన్క్స్‌, దెబెట్స్క్‌ స్వతంత్ర ప్రాంతాలు రష్యాలో విలీనమైనట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. క్రెమ్లిన్‌లోని సెయింట్ జార్జ్ హాల్‌లో జరిగిన వేడుకలో నాలుగు ప్రాంతాల అధిపతులు రష్యాలో విలీన ఒప్పందంపై సంతకాలు చేశారు.పుతిన్‌ మాట్లాడుతూ.. ఇకపై నాలుగు ప్రాంతాలపై ఏదైనా దాడి జరిగినా.. అది రష్యాపైనే దాడి పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన 15శాతం భూభాగం రష్యాలో కలిసిందని పుతిన్‌ పేర్కొన్నారు. మా భూభాగాలను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధమన్నారు. అయితే, పుతిన్‌ ప్రకటనపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. పుతిన్‌ ప్రకటన పనికిరానిదంటూ కొట్టిపడేశారు. వాస్తవాలను ఎవరూ మార్చలేరన్నారు. ఇదిలా ఉండగా.. నాలుగు ప్రాంతాల విలీన ప్రక్రియను వచ్చేవారం రష్యన్‌ పార్లమెంట్‌ ఆమోదించనున్నది. విలీనంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఒప్పందానికి ఆమోదముద్ర వేయనున్నది.