ఉక్రియన్ పై రష్యా దాడితో..రష్యాలో నిలిచిపోయిన గూగుల్ పే సేవలు…

రష్యాలో నిలిచిపోయిన గూగుల్ పే సేవలు…

ఉక్రియన్ పై రష్యా దాడితో..ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు పెడుతున్నాయి.. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అమెరికా అక్కడ భారీ ఆర్థిక ఆంక్షలు విధించడంతో వేలాది మంది రష్యన్ కస్టమర్లు గూగుల్ పే, యాపిల్ పే సేవలను ఉపయోగించలేకపోతున్నారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ రష్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆంక్షలు ఎదుర్కొంటున్న బ్యాంకుల కస్టమర్లు విదేశాల్లో కార్డుల ద్వారా చెల్లింపులు నిర్వహించే వీలుండదని, ఇక నుంచి గూగుల్‌ పే, యాపిల్‌ పే ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపలేరు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఏటీఎంల వద్ద క్యూలో నిల్చుంటున్నారు.