ఉక్రెయిన్‌పై రష్యా వార్ శ్రీలంకను కష్టాల్లోకి నెట్టేసింది…లీటర్ పెట్రోల్ ధర రూ.200 దాటింది. ..

ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం క్రమంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస‍్థలపై ప్రభావం చూపుతోంది. యుద్దం ప్రారంభమైన రోజునే దీని ప్రభావం ముడి చమురు ఎగుమతులపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు….
ఉక్రెయిన్‌పై రష్యా వార్ శ్రీలంకను మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకను చమురు ధరలు నిండా ముంచేశాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.200 దాటింది.డీజిల్‌ ధర రూ. 139కి పెరిగింది.. మరోవైపు నిత్యావసరాల ధరలు కూడా పెరగడంతో సామాన్యుడి బతుకు దినదినగండంలా మారింది…ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం ప్రారంభమైన రోజునే ఈ ప్రభావం ముడి చమురు ఎగుమతులపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఊహించిన విధంగానే ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న వార్ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలపై పడింది. దీంతో శ్రీలంకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. శ్రీలంకలోని చమురు సంస్థలు పెట్రోల్‌పై రూ. 20, డీజిల్‌ రూ. 15లను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 204కు చేరగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 139కి పెరిగింది. శ్రీలంక ప్రభుత్వ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశంలో ఆహార, ఆర్థిక సంక్షోభం నెలకొంది. విదేశీ మారక నిల్వలను ఆదాచేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బ్లాక్ మార్కెట్‌లో బియ్యం, చక్కెర, ఉల్లిపాయలు సహా నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వీటికి తోడు గతేడాది అక్టోబర్‌లో వంట గ్యాస్ ధర సిలిండర్ రూ. 2,657కి చేరి రికార్డు సృష్టించడంతో శ్రీలంకలో సామాన్యుడు బతకలేక అల్లాడిపోతున్నాడు.