రష్యా-ఉక్రెయిన్‌ మధ్య రెండో దశ చర్చలు ప్రారంభం…

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య భీకర యుద్ధంలో ఇరుదేశాలు భారీ నష్టాన్నే చవిచూశాయి. ఉక్రెయిన్‌పై ఎనిమిది రోజులుగా సాగిస్తోన్న యుద్ధానికి సంబంధించిన వివరాలను రష్యా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. యుద్ధంలో ఇప్పటివరకు 498 మంది సైనికులను కోల్పోయామని రష్యా ప్రకటించింది. 16 వందల మంది రష్యా సైనికులు గాయపడ్డారని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఉక్రెయిన్‌కు చెందిన ఎస్-300, బీయూకే-ఎం1 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ వ్యవస్థను రష్యా ధ్వంసం చేసింది. పలు మిలటరీ హెలికాప్టర్లు, నాలుగు డ్రోన్లను నేలకూల్చింది. ఇక, ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు తొలిసారి విఫలం కాగా.. ఇవాళ రెండో దశ చర్చలు ప్రారంభం అయ్యాయి…చర్చలు సాగుతున్నా.. దాడులు ఆపేది లేదని ఇప్పటికే రష్యా స్పష్టం చేసింది.. మా డిమాండ్లను ఇంతకు ముందే చెప్పం.. అది ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే.. దోనాస్క్‌ ల్యూనిస్క్‌లను వదిలేయాలని ఉక్రెయిన్‌ అంటుండగా.. రెండో విడత చర్చలు ఎలా సాగుతాయి.. రెండో దఫాలైనా సఫలం అవుతాయి.. కొన్ని విషయాలైనా కొలిక్కి వస్తాయా? అనేది ఆసక్తికరంగ మారింది.