ఉక్రెయిన్‌ రాజధానిలోకి రష్యా బలగాలు..రష్యా చేతికి కీవ్‌..ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో తాలిబ‌న్లు చేసిన కీల‌క వ్యాఖ్య‌లు…..

కీవ్‌ను ఆక్ర‌మించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి ర‌ష్యా ద‌ళాలు. ఉక్రెయిన్ సైన్యం ప్ర‌తిఘ‌టిస్తున్నా అది ఎంత‌సేపు అన్న‌ది ఎవ‌రూ చెప్ప‌లేరు. ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో తాలిబ‌న్లు చేసిన కీల‌క వ్యాఖ్య‌లు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. యుద్ధం విష‌యంలో రెండు దేశాలు సంయ‌మ‌నం పాటించాల‌ని, హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ‌టం ద్వారా ఎలాంటి ఉప‌యోగం ఉండ‌బోద‌ని తాలిబ‌న్లు హెచ్చ‌రించారు. స‌మ‌స్య‌ల‌ను రెండు దేశాలు చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని తాలిబ‌న్లు ట్వీట్ చేశారు. ఉక్రెయిన్‌లో ఉన్న ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌లు సుర‌క్షితంగా, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తెలిపారు…. పలు కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి రష్యా బలగాలు.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలోని కీలకమైన విమానాశ్రయాన్ని కూడా హస్తగతం చేసుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. దీంతో పశ్చిమ దేశాలతో కీవ్‌కు ఉన్న సంబంధాలు తెగిపోయేలా చేసింది రష్యా.. అతిపెద్ద రన్​వేతో కూడిన ఈ ఎయిర్​పోర్ట్​కు భారీ రవాణా విమానాలు వచ్చే అవకాశం ఉండడంతో.. కీవ్​శివారులోని తమ బలగాల్ని తరలించాలన్నా.. రప్పించాలన్నా రష్యాకు మరింత సులువు అయ్యింది.రష్యా బలగాలకు ఉక్రెయిన్‌ సైనికుల నుంచి ప్రతిఘటన గట్టిగానే ఎదురవుతున్నట్టుగా తెలుస్తోంది.. ఉక్రెయిన్​రాజధాని కీవ్ సిటీని ఆక్రమించుకునేందుకు రష్యా బలగాలు దూసుకెళ్తుంటే.. ఉక్రెయిన్​సేనలు ప్రతిఘటిస్తున్నాయి.. అయితే, ఈ దాడుల్లో ఇప్పటివరకు రష్యాకు చెందిన వేయి మందికి పైగా సైనికులు మృతిచెందినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది.. ఇక, ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్.. దీని కోసం బెలారస్​రాజధాని.. మిన్స్క్​కు ఉన్నతస్థాయి అధికారులను పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్‌ వెల్లడించారు….సైనిక చర్య అని చెప్పి ఉక్రెయిన్‌పై దాడులకు తెగబడిన రష్యా మరింతగా రెచ్చిపోయింది. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతానికి పరిమితమైన రష్యా బలగాలు శుక్రవారం రాజధాని కీవ్‌లోకి ప్రవేశించాయి. జనావాసాల్లో యుద్ధ ట్యాంకులు స్వైర విహారం చేశాయి. సైనికుల పరేడ్‌, యుద్ధ విమానాల విన్యాసాలతో నగరమంతా రణభూమిని తలపించింది. పలు ప్రాంతాల్లో పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొన్న ప్రజలు మెట్రో అండర్‌గ్రౌండ్‌ పాస్‌, సబ్‌వే, బంకర్లలో తలదాచుకొన్నారు. నగరం బయట ఉన్న వ్యూహాత్మకమైన ఎయిర్‌పోర్ట్‌ను తమ అధీనంలోకి తీసుకున్నట్టు రష్యా ప్రకటించింది. రష్యా దురాక్రమణను అడ్డుకోవడానికి ఉక్రెయిన్‌ దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రధాన నగరాల్లోకి శత్రువులు ప్రవేశించకుండా వంతెనలను పేల్చేస్తున్నాయి. యుద్ధంలో వెయ్యి మందికి పైగా రష్యా సైనికులు మరణించినట్టు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ వెల్లడించింది.