యుద్దానికి తాత్కాలిక విరామం.. కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా…

దాదాపు గత 10 రోజులుగా ఉక్రెయిన్‌పై కాల్పులు, బాంబులతో విరుచుకుపడుతోన్న రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని మరియుపోల్, వోల్నోవాఖా నగరాల నుంచి పౌరుల తరలింపుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శనివారం ఉదయం ప్రకటన చేసినట్లు రష్యన్ న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ న్యూస్ వెల్లడించింది…
రష్యా తాత్కాలికంగా కాల్పులను విరమించింది. పోర్ట్‌ సిటీ మరియుపోల్‌, వోల్నావఖా పట్టణాలను రష్యన్‌ బలగాలు చుట్టుముట్టాయి. అయితే యుద్ధ క్షేత్రం నుంచి పౌరులను తరలించేందుకు అవకాశం కల్పించింది. మాస్కో కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటల నుంచి ఐదున్నర గంటలపాటు కాల్పులను విరమిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది..హ్యూమన్‌ కారిడార్‌ కోసం వోల్నావఖా, మరియుపోల్‌లో కాల్పులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని తెలిపింది. ఈ సమయంలో ప్రజలకు ఆహారం అందించనున్నారు. దీంతోపాటు ప్రాథమిక చికిత్స చేయనున్నారు. దీంతోపాటు రెండు పట్టణాల్లో విద్యుత్‌,
నీటి సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నది…

జపోరిజియా పవర్‌ ప్లాంటు స్వాధీనంతో రష్యా తన ఆక్రమణ పర్వంలో ఒక దశను విజయవంతంగా పూర్తి చేసినైట్టెంది. భౌగోళికంగా ఉక్రెయిన్‌లో ఒక భాగాన్ని పూర్తిగా వశపర్చుకొన్నది. తూర్పు ఉక్రెయిన్‌లో నీపహ్‌ నది చాలా కీలకమైనది.
ఇది దేశాన్ని రెండుగా విభజిస్తున్నది. ఈ రెండు భాగాల మధ్య వారధిలా ఉన్నది జపోరిజియా పవర్‌ ప్లాంటు మాత్రమే. ఇప్పుడు దాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఉక్రెయిన్‌ నుంచి తూర్పు భాగాన్ని పూర్తిగా వేరు చేసింది. ఉక్రెయిన్‌ నియంత్రణ నుంచి తప్పించింది.