పైలట్ పొరపాటుతో నదిపై దిగిన విమానం..!.

VIDEO: కన్ఫ్యూజన్ లో నదిపై దిగిన విమానం

రష్యాలోని యకుటియా ప్రాంతంలో ఒక విమానం నదిపై ల్యాండైంది. సోవియట్ కాలం నాటి అంటోనోవ్ యాన్ 24 విమానం జిర్యాంక విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే, రన్ వే పూర్తిగా మంచులో కూరుకుపోయింది. పక్కనే ఉన్న కొలిమా నది కూడా గడ్డకట్టింది.

గడ్డ కట్టిన నదిపై 34 మంది ప్రయాణికులతో ఉన్న విమానాన్ని పైలట్ పొరపాటున దించేశారు .

ఈ సంఘటన రష్యా తూర్పు ప్రాంతంలో జరిగింది.

సోవియట్ కాలం నాటి అంటోనోవ్ యాన్ 24 విమానం గురువారం ఉదయం గడ్డకట్టిన కోలిమా నదిపై దిగింది.

ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

జైర్యాంకా విమానాశ్రయ రన్‌వేకు దూరంగా ఈ విమానం ల్యాండ్ అయింది.

ప్రాథమిక విచారణలో పైలట్ తప్పిదమే దీనికి కారణమని స్థానిక ప్రాసిక్యూటర్లు చెప్పారు…
రష్యా ఫార్‌ఈస్ట్‌ ప్రాంతంలోని సఖా రిపబ్లిక్ రాజధాని యాకుత్స్క్ నుంచి పీ1217 విమానం గురువారం ఉదయం బయల్దేరింది.

ఈ విమానం ఈశాన్య భాగంలో 1,100 కిలోమీటర్ల దూరంలోగల జైర్యాంకాకు చేరుకుంది. దాని తరువాత యాకుత్స్క్‌కు తిరిగి వచ్చేటప్పుడు స్రెడ్నెకోలిమ్స్క్ లోని చిన్న పట్టణానికి వెళ్ళాల్సి ఉంది.

తూర్పు సైబీరియాలోని గడ్డకట్టిన కోలిమా నది మధ్య భాగంలో ఈ విమానం దిగినట్టుగా ఓ పాసింజర్ తీసిన వీడియోలో కనినిస్తోంది.

సహజంగా ఏటా ఈ సమయంలో జైర్యాంకాలో మైనస్ 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి.

అయితే ఈ విమానం దిగిన చోట దిగువన ఇసుక ఉందని స్థానిక ప్రాసిక్యూటర్లు చెప్పారు.

గడ్డ కట్టిన నదిపై ఏర్పడిన చక్రాల గుర్తులు, విమానం పూర్తిగా ఆగిపోవడానికి ఎంత సమయం పట్టిందో సూచిస్తున్నాయి.