రైతు బీమా నమోదు గడువు..

రైతాంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. రైతుల కోసం దేశంలో ఎక్కడ లేనివిధంగా రైతు బంధు తీసుకొచ్చారు. దీనితోపాటు రైతుల కోసం రైతు బీమాను అందుబాటులోకి తీసుకొచ్చు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు బీమా నమోదు గడువును ఈనెల 13 వరకు పొడిగించారు. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది….ఒకటో తేదీ వరకు రైతు బీమా రెన్యువల్, కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. గత నెల 15న మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఐతే సాంకేతిక కారణాలతో వెబ్‌సైట్ తెరుచుకునేందుకు సమయం పట్టింది. దీంతో రైతు బీమా పనుల్లో జాప్యం జరిగింది. పాత రెన్యువల్స్ 38.98 లక్షల ఎల్‌ఐసీ ఐడీలున్న రైతుల వెరిఫికేషన్‌ ఆలస్యమైంది.

దీంతోపాటు 11.83 లక్షల కొత్త అప్‌లోడ్‌కు చేయలేని పరిస్థితి తలెత్తింది. గడువు కేవలం 15 రోజులు ఉండటంతో గందరగోళం నెలకొంది. గతనెలలో భారీ వర్షాలు కురవడంతో రైతు బీమా నమోదు సరిగా జరగలేదు. అర్హులై 50.82 లక్షల మంది రైతు బీమా నమోదు పూర్తి కాలేదు. దీంతో అన్నింటిని పరిగణలోకి తీసుకున్న అధికారులు..గడువును పెంచారు.
ఈనెల 13 సాయంత్రం 6 గంటల వరకు రైతు బీమా నమోదు అవకాశం ఉంది. వీటిని ఏఈవోల దగ్గర నమోదు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు నమోదు చేసుకోని రైతులు వెంటనే సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది. మరోవైపు పంట నష్టం అంచనా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి..నివేదిక ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది..