మంత్రి సబితా బంధువుల ఇళ్లపై ఐటీ అధికారుల దాడులు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు తరుముకు వస్తున్న నేపథ్యంలో… హైదరాబాద్ మహానగరంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పారిజాత, మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లల్లో ఐటి సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఆయా నేతలకు ఐటీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు.అయితే తాజాగా తెలంగాణ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మంత్రి సబితా ఇంద్ర రెడ్డికి సంబంధించిన బంధువులు అలాగే సంబంధీకుల ఇళ్లల్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ఉన్న సబితా ఇంద్రారెడ్డి బంధువులు ప్రదీప్ ఇంట్లో కూడా ఐటి సోదాలు జరుగుతున్నాయి. అటు హైదరాబాదులోని పలు ఫార్మా కంపెనీలలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ మహానగరవ వ్యాప్తంగా మొత్తం 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. ఫార్మా కంపెనీ యాజమాని ఇల్లు, డైరెక్టర్ అలాగే సిబ్బంది ఇండ