సద్గురు జగ్గీవాసుదేవ్‌కి బ్రెయిన్ సర్జరీ… ఇంత నొప్పిని కూడా తట్టుకొని మీటింగులకు హాజరయ్యాడా…!

ఎక్కువగా తలనొప్పి వస్తుంది.
వికారం
వాంతులు
నిద్రమత్తు
శరీరంలో ఓ పక్క పూర్తిగా మొద్దుబారినట్లుగా ఉంటుంది.
అలసట, నీరసంగా ఉంటారు.
మాట్లాడలేకపోవడం..

సద్గురు జగ్గీవాసుదేవ్‌కి ఈ మధ్యకాలంలోనే బ్రెయిన్‌లో రక్తస్రావం జరగడంతో బ్రెయిన్ సర్జరీ జరిగింది. ప్రజెంట్ ఆయన కోలుకుంటున్నారు. సాధారణంగా మెదడులో రక్తస్రావం ఎందుకు జరగుతుందంటే రక్తనాళాలు ఒత్తిడికి లోనై బలహీనపడినప్పుడు ఇలా జరుగుతుంది. దీనినే హెమరేజ్ స్ట్రోక్ అంటారు..

ఇషా ఫౌండేషన్ (Isha Foundation) వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు (Sadhguru Jaggi Vasudev) న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో (Apollo Hospital) అత్యవసర బ్రెయిన్ సర్జరీ (Brain Surgery) జరిగింది. గత నాలుగు వారాల నుంచి తీవ్ర తలనొప్పితో (Severe Headache) బాధపడుతున్న ఆయన్ను పరిశీలించగా.. మెదడులో భారీ రక్తస్రావంతో పాటు వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఈనెల 17వ తేదీన బ్రెయిన్ సర్జరీ చేశామని, ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సద్గురు ఆసుపత్రిలో పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటున్నారని స్పష్టం చేశారు…. మార్చి 17న సద్గురు నాడీ సంబంధిత స్థితి వేగంగా క్షీణించిందని, దాంతో ఆయనకు వాంతులు అయ్యాయని చెప్పారు. అప్పుడు ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వగా.. CT-స్కాన్ చేశామన్నారు.

ఆ రిపోర్ట్ ఆధారంగా సద్గురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారన్న విషయం తేలిందని.. దీంతో కొన్ని గంటల్లోనే ఆయనకు మెదడు శస్త్రచికిత్స చేశామని డాక్టర్ వినిత్ సూరి వెల్లడించారు. ఆ సర్జరీని వినిత్ సూరి, ప్రణవ్ కుమార్, సుధీర్ త్యాగి, ఎస్ ఛటర్జీ నేతృత్వంలోని వైద్యుల బృందంలో నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని.. మెదడు, శరీరం, వైటల్ పారామీటర్స్ సాధారణ స్థితికి చేరుకున్నాయని చెప్పారు. తాము ఊహించిన దానికంటే వేగంగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు. మరోవైపు.. అపోలో ఆసుపత్రిలోని న్యూరో సర్జర్లు తన పుర్రెను కోసి ఏదో శోధించేందుకు ప్రయత్నించారని, కానీ వాళ్లు ఏమీ కనుగొనలేకపోయారంటూ సర్జరీ అనంతరం సద్గురు ఛలోక్తులు పేల్చారు..

ఇందులో నమ్మలేని నిజాలు ఏమిటంటే….

ఆల్రెడీ బ్రెయిన్ లో రక్తస్రావం జరిగి కొన్ని రోజులు అవుతుంది.. అది కూడా శివరాత్రి ముందే అలా జరిగినప్పుడు ఏ వ్యక్తి కూడా కనీసం లేచి నిలబడి మాట్లాడే అవకాశం ఉండదు… కానీ ఓ పెద్ద ఈవెంట్ ని చేసి… తరువాత మూడు మీటింగులకి హాజరై… ఎంఐ స్కాన్ తీసిన తర్వాత కూడా.. మళ్లీ పాత రక్తస్రావం మరియు కొత్తగా రక్తస్రావం జరగటం.. దాని తర్వాత కూడా మళ్లీ రెండు మూడు మీటింగులకి హాజరై చికిత్సకి రావడం వైద్యుల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది… అత్యంత ప్రమాదకర స్థాయి నుండి చాలా సున్నితంగా తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది… ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎటువంటి ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు..