BREAKING: గాయకుడు సాయిచంద్ మృతి
TS: ప్రముఖ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మెన్ సాయిచంద్ (39) గుండెపోటుతో మరణించారు. నిన్న కుటుంబంతో కలిసి నాగల్ కర్నూల్ జిల్లా కారుకొండలో తన ఫామ్ హౌస్కి వచ్చిన ఆయన.. రాత్రి గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. చికిత్స కోసం నగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుండి గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు..
సాయిచంద్ తెలంగాణ ఉద్యమ కళాకారుడిగా ప్రసిద్ధి చెందారు.
‘ధూంధాం’లతో సాయిచందు గుర్తింపు
గాయకుడు సాయిచంద్ 1984లో వనపర్తి జిల్లాలో జన్మించారు. తండ్రిలాగే అభ్యుదయ భావాలు కల్గిన సాయిచంద్.. ప్రజా సమస్యలపై పాటలు రాసి చైతన్య పరిచారు. తెలంగాణ ఉద్యమంలో ధూంధాం కార్యక్రమాలతో ప్రజల్లో ఉద్యమకాంక్షను రగిలించారు.
తెలంగాణ వచ్చాక BRSలో కొనసాగుతున్నారు.
ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు..
*మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ల తీవ్ర దిగ్భ్రాంతి.
ఆయన అకాల మరణం రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్య శాఖామాత్యులు తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంచి ఉద్యమ కారున్ని, గాయకున్ని కోల్పోయామని వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..