ప్రేమకథ తో తెరకక్కిన సీతారామం సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. సాధారణ ప్రేక్షకులే కాకుండా క్రిటిక్స్, సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను, రివ్యూలను సోషల్ మీడియాలో పంచుకొంటున్నారు. నా హృదయపు పొరల్లో అందమైన చిత్రం గురించి నేను చాలా సార్లు ఐ హేట్ యూ అని రాసి.. మళ్లీ చెరిపేశాను అంటూ సాయిధరమ్ తేజ్ కామెంట్ చేశాడు. తాజాగా సీతారామం సినిమాపై ప్రత్యేకంగా రాసిన సాయిధరమ్ తేజ్ రివ్యూ ఎలా ఉందంటే…స్వప్నక్క ఏ హేట్ యూ. నీవు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి
స్వప్నక్క ఏ హేట్ యూ. నీవు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి
ముందుకు తీసుకురావడానికి రెండేళ్లు నీవు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. నీవు రామ్, సీత ప్రేమకథను ఎంతగా నమ్మావో నాకు తెలుసు. ముత్యం లాంటి సినిమాను నిర్మించడమే కాకుండా సమాజంలో ఇంకా ప్రేమ ఉందనే నమ్మకం కలిగించావు. నిజమైన ప్రేమ కోసం బ్రహ్మచారిగా నేను తపించేలా చేశావు అని సాయిధరమ్ తేజ్ తన పోస్టులో తెలిపేరు..
రాఘవపూడి.. ఐ హేట్ యూ. నీవు ప్రతీ విభాగాన్ని అద్భుతంగా చూపించావు. ప్రతీ ఫ్రేమ్‌ను దృశ్యకావ్యంలా మలిచి ఓ మ్యాజిక్‌ను ఆవిష్కరించావు. ప్రతీ క్యారెక్టర్‌ను అద్బుతంగా మలిచావు. ప్రతీ సీన్‌లో నటీనటులు వందకు వంద శాతం తమ ప్రతిభను చూపించారు…