సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సాయి పల్లవి అంటే స్పెషల్…

సాయి పల్లవి అంటే..బాడ్కవ్..బల్సిందా..రా బొక్కలిరగ్గొడ్తా..అనే డైలాగ్ అందరికీ ముందు గుర్తొస్తుంది. కేరళ నేపథ్యం అయినా కూడా ఫిదా సినిమా కోసం పక్కా తెలంగాణ యాసలో డైలాగులు పలికి తెలుగమ్మాయే అనిపించింది.
ఈ ఒక్క సినిమా సాయి పల్లవికి తెలుగులో అసాధారణమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. దీని తర్వాత పడి పడి లేచేమనసు, ఎంసిఏ, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరి, ఇటీవల విరాట పర్వం సినిమాలు చేసింది. సాయి పల్లవి కెరీర్‌లో అంత భారీ హిట్స్ కూడా ఏమీ లేవనే చెప్పాలి. ఫిదా, లవ్ స్టోరి సినిమాలు సూపర్ హిట్.
పడి పడి లేచేమనసు, ఎంసిఏ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం సినిమాలు ఫ్లాప్‌గా మిగిలాయి. సాధారణంగా ఈ స్థాయి హీరోయిన్‌ను ఎవరూ పట్టించుకోరు అని చెప్పొచ్చు. కానీ, నేచురల్ పర్ఫార్మెన్స్‌తో అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనివల్లే సాయి పల్లవికి సినిమాలు ఫ్లాపయినా కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే, సాయి పల్లవికి నచ్చింది కాబట్టే ఇక్కడుంది. లేదంటే ఎప్పుడో ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయేది. ఇక సాయి పల్లవి నటించిన ప్రతీ సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటుంది. కానీ, అనూహ్యంగా ఆమె నటించిన సినిమాలు సగానికి పైగానే ఫ్లాపయ్యాయి.