బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సలార్ చిత్రం … షారుక్ రికార్డును అధిగమించిన ప్రభాస్.!.

ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన సలార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల పర్వాన్ని కొనసాగిస్తున్నది. ఈ సినిమా డంకీతో పోటీ పడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది..అయితే షారుక్ ఖాన్ లాంటి అగ్ర హీరో, రాజ్‌కుమార్ హిరాణి సినిమాను వెనక్కి నెట్టి భారీగా కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన రికార్డుల్లోకి వెళితే..శృతిహాసన్, పృథ్వీరాజ్‌ సుకుమారన్ నటించిన సలార్ చిత్రం తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌ను రఫాడిస్తున్నది.
ఈ సినిమా మొదటి రోజు 180 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టి తన స్టామినాను ట్రేడ్ వర్గాలకు రుచి చూపించింది. అయితే ప్రతీ రోజు భారీ కలెక్షన్లను సాధిస్తూ 2023 సంవత్సరంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులు తిరగరాస్తున్నది.
సలార్ చిత్రం డంకీ మూవీకి అందనంత దూరంగా రికార్డు సృష్టించింది. టికెట్ల అమ్మకాల్లో డంకీ మూవీని వెనక్కి తోసింది. సలార్ మూవీ గంటలోనే 10.3 లక్షల టికెట్లు అమ్మితే.. డంకీ మూవీ మాత్రం కేవలం 5.2 లక్షల టికెట్లు అమ్మింది. డంకీతో పోల్చితే సలార్ రెండింతలు ఎక్కువగా కలెక్షన్లు సాధించింది.

ఇక సలార్ చిత్రం హిందీలో 125 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఇక అన్ని భాషల్లో ఈ సినిమా 340 కోట్ల రూపాయల నికర కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 10 రోజుల్లో 580 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా అరుదైన 600 కోట్ల రూపాయలు క్లబ్‌లో చేరే అవకాశాన్ని సులభతరం చేసుకొన్నది.

అలాగే సలార్ చిత్రం ఓవర్సీస్‌లో కూడా రికార్డు వసూళ్లు సాధిస్తున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలిపి 15 మిలియన్ల కలెక్షన్లు సాధించింది. దాంతో సుమారుగా 125 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో రాబట్టింది..సలార్ చిత్రం 11వ రోజున కూడా భారీ వసూళ్లు నమోదు చేసింది. ఈ సినిమా హిందీ వెర్షన్ 10 కోట్ల నికరంగా కలెక్షన్లను రాబడితే.. అన్ని భాషల్లో కలిపి 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 600 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది.