సలేశ్వరం జాతరకు భక్తులు రావద్దు…

నాగర్ కర్నూల్ జిల్లా సలేశ్వరం లింగమయ్య జాతరకు ఆటంకం ఏర్పడింది. అకస్మాత్తుగా ఈదురుగాలులు, అకాల వర్షంతో లింగమయ్య జాతరకు వేసిన రోడ్లు కొట్టుకుపోయాయి.

ఈ నేపథ్యంలో సలేశ్వరం జాతరకు భక్తులను రావద్దంటూ అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. జాతరకు వచ్చి భక్తులు ఎవరూ ఇబ్బందులు పడవద్దని అటవీశాఖ పేర్కొంది.