తెలుగు హీరోయిన్ సమంత టాప్ ప్లేస్ లొ…!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏం మాయ చేసావే సినిమాలో జెస్సీ పాత్రలో ఒదిగిపోయి నటించిన సమంత మొదటి సినిమా నుంచి పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ వరకు ప్రతి ఒక్క సినిమాలోనూ విభిన్నమైన నటనా శైలి ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇకపోతే తాజాగా ఆర్మాక్స్ మీడియా సర్వే ప్రకారం ఈ ఏడాది మే నెలలో టాప్ సెలబ్రెటీలను వెల్లడించారు.

ఇండియా హీరోల లిస్ట్ విడుదల చేసిన ఆర్మాక్స్ మీడియా సంస్థ ఇప్పుడు మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్ జాబితాని కూడా విడుదల చేసింది. ఇక ఈ జాబితాలో తెలుగు హీరోయిన్ సమంత టాప్ ప్లేస్ సాధించి సత్తా చాటారు. ఇక ఈ జాబితాలో మరో తెలుగు మూలాలు ఉన్నా హీరోయిన్ లేరు కానీ తెలుగు సినిమాల్లో మెరుస్తున్న మరి కొంతమంది హీరోయిన్లు ఈ జాబితాలో సమంత మొదటి స్థానం సంపాదించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో వరుస సినిమాలు చేస్తూ హిందీ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆమె పలు బాలీవుడ్ ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ దానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. అలియా భట్ ఈ జాబితాలో రెండవ స్థానాన్ని సంపాదించింది. రణవీర్ కపూర్ తో కలిసి బ్రహ్మాస్త్రా అనే సినిమా చేస్తున్న ఆమె ఇటీవలే గర్భవతిని అయ్యానంటూ ప్రకటించింది…