సమంత తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో ఆసక్తి వ్యాఖ్యలు చేసిన సమంత..!!
సాంగ్ హాట్ లుక్స్‌తో బోల్డ్ గా ఎందుకు చేశావు.!!!
కాఫీ వీత్ కరణ్ జోహార్ షోలో తాజాగా స్టార్ హీరోయిన్ సమంత సందడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎపీసోడ్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే సమంత-నాగ చైతన్య విడాకులపై నెలకొన్న ఎన్నో సందేహాలు ఈ ఎపోసొడ్తో తీరుతాయని సౌత్ ప్రేక్షకులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు సమంత ఎపిసోడ్ గత రాత్రి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. అందరు అనుకున్నట్లుగానే ఈ షోలో సామ్‌కు విడాకులు, ట్రోల్స్, భరణంపై ప్రశ్నలు ఎదురయ్యాయి…
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె చేసిన పుష్ప సాంగ్ సూపర్ హిట్ అయింది. ఆ పాట ద్వారా ఆమెకు మరింత క్రేజ్ లభించింది. తాజాగా ఆ పాట చేయడం వెనుక ఉన్న కారణాలను సమంత బయట పెట్టింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కూడా అక్టోబర్ నెలలో విడాకులు తీసుకుంటున్నామని అధికారులు ప్రకటించారు. వీరు ఈ మధ్య ఏం సమస్య తెలియదు కానీ వీరి విడాకుల గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటికీ కూడా వీరి గురించి ఎలాంటి వార్త వచ్చినా అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉంటుంది. అయితే సమంత తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న నేపథ్యంలో ఆయన సమంత పర్సనల్ విషయాల్లో సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగారు…కొన్నింటికి సమాధానం చెప్పిన సమంత కొన్నింటికి మాత్రం తెలివిగా సమాధానాలు చెప్పి తప్పించుకుంది. ఆ సంగతి పక్కన పెడితే సమంత పుష్ప సినిమా విడుదలకు 20 రోజులు ఉందనగా ఒక ఐటమ్ సాంగ్ చేయడం కరెక్టే అనుకుంటున్నావా అని కరణ్ ప్రశ్నిస్తే అందుకు సమంత ఆసక్తికరంగా స్పందించింది. ఆ ప్రశ్నకు కరణ్ జోహార్ మూడు ఆప్షన్స్ ఇవ్వగా ఆప్షన్స్ తో మూడో ఆప్షన్ ఎంచుకుంటూ అందరికీ షాక్ ఇచ్చింది. అలాగే ఈ సాంగ్ చేయడానికి గల కారణాలను కూడా సమంత వెల్లడించింది. సాంగ్ హాట్ లుక్స్‌తో బోల్డ్ గా ఎందుకు చేశావు ? ఇది తిరుగు బాటు చర్యా లేకా వ్యూహాత్మక ఎత్తుగడా, లేదా ‘ఫ*, నేను చేస్తాను’ అయితే ఏంటి అని భావించి చేశారా అంటే ఆమె అదే ఆప్షన్ ఎంచుకుంది. అనంతరం సామ్ ఐటమ్ సాంగ్ ఎందుకు చేశాను అనేది వివరణ ఇస్తూ.. ‘ఈ పాట మగవారికి వ్యతిరేకంగా ఉంటుందని, తేడాగా చూసే మగవారి చూపులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. మగవారిపై సెటైరికల్‌గా ఉన్నందునే ఈ సాంగ్ చేశాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది…