గద్దెపైకి నేడే సమ్మక్క తల్లి రాక..

*గద్దెపైకి నేడే సమ్మక్క తల్లి రాక*
క్రింద వీడియో లింక్ క్లిక్ చేసి చూడగలరు..
https://youtube.com/shorts/mb80cGl6TT4?si=dLAGrwX_DxVHyjok

డప్పు చప్పుళ్లు.. కోయల నృత్యాలు.. భక్తుల జయజయ ధ్వానాల నడుమ సారలమ్మ మేడారం గద్దెపైకి చేరుకుంది. ఫలితంగా మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది. సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం ఉదయం ఆమె వెలసిన కన్నెపల్లి ఆలయం నుంచే ఆర్భాటంగా మొదలైంది. ఆలయాన్ని శుద్ధి చేసి.. ముగ్గులతో అలంకరించిన అనంతరం ఆదివాసీ పూజారులు సాయంత్రం ఏడుగంటల దాకా ప్రత్యేక పూజలు చేశార

సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం బుధవారం ఉదయం ఆమె వెలసిన కన్నెపల్లి ఆలయం నుంచే ఆర్భాటంగా మొదలైంది. ఆలయాన్ని శుద్ధి చేసి.. ముగ్గులతో అలంకరించిన అనంతరం ఆదివాసీ పూజారులు సాయంత్రం ఏడుగంటల దాకా ప్రత్యేక పూజలు చేశారు.

సారలమ్మ తల్లి రూపంలో ఆలయం నుంచి బయటకు వచ్చిన పూజారి సారయ్య.. భక్తుల మొక్కుల సమర్పణ నడుమ మేడారం దిశగా కదిలారు. కన్నెపల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరం దారిపొడవునా భక్తులు బారులుతీరి హారతులిచ్చారు.

రాత్రి 12.11 గంటలకు సారలమ్మ గద్దెకు చేరుకుంది. మహబూ బాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ నుంచి పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజును కూడా గద్దెలపైకి చేర్చారు.

అంతకుముందు పగిడి ద్దరాజు-సమ్మక్క కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఇక మేడారం జాతర రెండో రోజు మరింత ప్రత్యేకం. సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క గురు వారం గద్దెపైకి రానుంది. సమ్మక్క ఆగమనం కోసం ఉదయమే ఏర్పాట్లు మొదలవుతాయి. తొలుత మేడారంలోని సమ్మక్క గుడిని శుద్ధి చేస్తారు.

మామిడి తోరణాలు కడతారు. శక్తిపీఠాన్ని ఎర్రమన్నుతో అలికి ముగ్గులు వేస్తారు. పూజారులు అడవికి వెళ్లి వెదురు వనం, అడెరాలు తెచ్చి గద్దెపై నిలుపుతారు. ఆడెరాలను పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. సాయంత్రం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో పూజారుల బృందం చిలుకల గుట్ట సమీపంలోకి వెళతారు.

అక్కడి నుంచి గుట్టపైకి ప్రధాన పూజారి ఒక్కరే వెళతారు. అక్కడ ఉన్న సమక్క రూపమైన కుంకుమ భరిణ, ఇతర పూజా సామగ్రిని శుద్ధి చేసి కృష్ణయ్య ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

ఈ పూజాతంతు అంతా గోప్యంగా జరుగుతుంది. ఆ తర్వాత పూజారి తల్లి స్వరూపాన్ని తీసుకొని కిందకు వస్తున్నట్టు సంకేతం ఇస్తారు. తల్లిని తీసుకొని ఆయన కిందకు దిగగానే అక్కడ మంత్రులు, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు.. సమ్మక్కకు స్వాగతం పలుకుతారు.

సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా ఎస్పీ గాల్లో మూడు రౌండ్లు తుపాకీని పేల్చుతారు. గుట్టపై నుంచి సమ్మక్క కిందకు ఏతెంచే వరకు గుట్ట కింద ఆదివాసీ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తారు. ఆట పాటలతో అలరిస్తారు.

పూజారులు సమ్మక్క తల్లితో కిందకు దిగిన తర్వాత అత్యంత వేగంగా మేడారం గద్దెవైపు కదులుతారు. దారి పొడవునా భక్తులు బారులుతీరి నిల్చుంటారు. మంగళహారతులు పడతారు. కోళ్లు, గొర్రెలను బలిస్తారు. వీలైనంత మేరకు రాత్రి 9-10 గంటల మధ్య సమ్మక్కను గద్దెపైకి పూజారులు తీసుకువచ్చేలా జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. సమ్మక్క గద్దెపైకి చేరుకోవడంతో జాతర మరోస్థాయికి చేరుతుంది….

ఐదు కి.మీ నడుచుకుంటూ మేడారానికి..

మేడారం జాతర కోసం పార్కింగ్‌ స్థలాల దాకా వచ్చే భక్తులకు అక్కడి నుంచి ఇబ్బందులెదురవుతున్నాయి. అక్కడి నుంచి మేడారానికి ఐదు కిలోమీటర్ల దూరం!! ఆర్టీసీ బస్సులు, కార్లు, వ్యాన్లు, జీపులు, బైక్‌ల వంటి ప్రైవేటు వాహనాలను పార్కింగ్‌ స్థలాల వరకే పోలీసులు అనుమతిస్తున్నారు. అక్కడి నుంచి లోపలికి బస్సులు సహా ఏ వాహనాలను అనుమతించకపోవడంతో భక్తులు మూటాముల్లె నెత్తిన పెట్టుకొని ఐదు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూనే వెళుతున్నారు. అయితే పార్కింగ్‌ స్థలాల నుంచి భక్తులను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేర్చుతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించినప్పటికీ అది అమలు కావడం లేదు. బుధవారం ఉదయం వరకు జనం పలుచగానే కనిపించినప్పటికీ సారలమ్మ వచ్చే వేళ సాయంత్రానికి ఒక్కసారిగా జనం తాకిడి పెరిగింది. జాతర నలువైపుల నుంచి ప్రవాహంలా భక్తులు తరలివస్తుండటంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. మేడారంలోకి ప్రవేశించే అన్ని మార్గాల వద్ద మోహరించిన పోలీసులు ప్రవేటు వాహనాలను అక్కడే నిలిపివేశారు. ప్రత్యేక పాస్‌లు ఉన్న వాహనాలనే లోపలికి అనుమతించారు. అయితే ప్రత్యేక వాహనాలేవీ ఏర్పాటు చేయకుండా భక్తులను మరీ ఐదు కిలోమీటర్ల మేర నడిపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి..