సాంబార్‎లో పాము ప్రత్యక్షం..!

హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో
(Hyderabad ECIL) జరిగిన ఘటన. ECIL కంపెనీకి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక్కడ వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. అయితే కంపెనీ క్యాంటిన్ మాత్రం దరిద్రంగా ఉంటుందని ఇవాళ జరిగిన ఘటనతో తేలిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం ఉద్యోగులంతా కలిసి క్యాంటిన్‌లో భోజనం చేస్తుండగా.. సాంబార్‌లో పాము (Snake) ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులు కంగుతిన్నారు. ఈ సాంబార్ తిన్న ఉద్యోగులు పలువురు అనారోగ్యానికి గురయ్యారు. నలుగురు ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో హుటాహుటిన ఈసీఐఎల్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా.. ఆ నలుగురు ఉద్యోగులు ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నారని వైద్యులు చెబుతున్నారు…

ఇదే హాట్ టాపిక్‎గా మారింది. సాంబార్‎లో పాము ప్రత్యక్షం కావడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి….
ఈ షాకింగ్ సంఘటన ఈసీఐఎల్ కంపెనీలో శుక్రవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం లంచ్ కోసం ఏర్పాటు చేసిన సాంబారులో పాము పిల్ల చనిపోయింది. ఈ విషయం తెలియక అప్పటికే చాలా మంది సాంబార్ తిన్నారు. దీంతో పలువులు ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన
సిబ్బంది వారిని స్థానికంగా ఉన్న హాస్పిటల్‎కు తరలించారు. అయితే పాము పిల్ల వంటకాల్లో కనిపించడంతో ఎంప్లాయిస్ అవాక్కయ్యారు. ఇదే అంశంపై క్యాంటీన్ నిర్వహకులు విస్తుపోతున్నారు.