ఘనంగా సంక్రాంతి సంబరాలు..

శంఖవరం మండలం కత్తిపూడి మాధురి విద్యాలయలో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు.సోమవారం మాధురి విద్యాలయ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు..

*ముఖ్య అతిథులుగా హాజరైన మాధురి విద్యాలయ అధినేత KT నాయుడు దంపతులు జ్యోతిప్రజ్వలనతో సంబరాలను ప్రారంభించారు*.

*ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఐదు రోజులు ముందుగా సంక్రాంతి వచ్చింది అని అన్నారు.సంక్రాంతి గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, హరిదాసులు వంటివి తెలుగుజాతికి చిహ్నాలని,భారతీయ ప్రాచీన సంప్రదాయాలను గౌరవించాలని, దేశ సంస్కృతికి అనుగుణంగా నడుచుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మాధురి విద్యాలయ అధినేత KT నాయుడు పేర్కొన్నారు*.
*మకర సంక్రాంతి భారతీయ సంస్కృతిలో ఒక పవిత్రమైన రోజు మరియు సర్వశక్తిమంతుడైన సూర్యునికి అంకితం చేయబన రోజు అని సమృద్ధిగా ఉన్న వనరులకు ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పండుగ మకర సంక్రాంతి అని అలాగే రైతులకు పంట కాలం ప్రారంభమైనందున రైతులు ప్రత్యేక పండుగ అని అన్నారు*.*దేశవ్యాప్తంగా రైతులు సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలుపుతూ మంచి పంట పండాలని ఆకాంక్షించారు*.*మనమంతా ముందు ముందు సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవలిసిన అవసరం ఎంత అయినా ఉంది అని అన్నారు*KT నాయుడు దంపతులు చిన్నారులకు భోగి పళ్ళు పోయుట ప్రత్యేక ఆకర్షణగా కనువింది చేసింది*. 

*కనుమరుగవుతున్న ఆచార వ్యవహారాలు,సంస్కృతి సంప్రదాయాలు కళ్ళకు కట్టినట్టు వివిధ వేశాధారణాలతో పల్లె వాతావరణం నెలకొన్నట్లు, పల్లె జీవన విధానము అద్దం పట్టినట్లు విద్యార్థులు ప్రదర్శించిన కళ నైపుణ్యం విక్షించిన ప్రతి ఒక్కరిని అబ్బుర పరచింది.గ్రామీణ ప్రాంతంలో పల్లె కళాఖండంను సొంతంగా తయారు చేసిన పల్లెలో గృహములు వాటి అలంకరణ చూపరులను ఆకట్టుకున్నాయి.భోగి మంట వద్ద నాయుడు సతీమణి సీతదేవి ఉపాధ్యాయునిలతో కలిసి నృత్యాలు ఆకట్టుకున్నాయి*.

*గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు గానాలు,సోదమ్మా సోది,జంగమ దేవర పొగడ్తలు, బ్రాహ్మణుల మంత్రోచ్చరణలు, పిల్లలు వేసిన ముత్తాయిదువుల వేశాధారణలు మురిపించాయి, మైమరిపించాయి*.*గోదా దేవి కళ్యాణం నృత్యం చూపరులను ఆకర్షిచింది *విద్యార్థులు తల్లితండ్రులు పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చాయి.అనంతరం చిన్నారుల సంప్రదాయ వేషధారణలు, గాలిపటాల ఎగురవేత, గొబ్బెమ్మల ముగ్గులు తదితర కార్యక్రమాలు అలరించాయి*.

*ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ప్రసన్న, ప్రిన్సిపాల్ ప్రసన్న, రహీమా, ఇంచార్జ్ ఆదినారాయణ మరియు ఉపాధ్యాయులు పిల్లలు తల్లితండ్రులు పాల్గొన్నారు*.