సంక్రాంతి పండుగ ఈ మధ్య కాలంలో జనవరి 15న వస్తోంది… ఎందుకు?…!

సంక్రాంతి పండుగ ఈ మధ్య కాలంలో జనవరి 15న వస్తోంది… ఎందుకు?..
2024లో మకర సంక్రాంతి పండుగ తేదీకి సంబంధించిన విషయంలో గందరగోళం నెలకొంది. దీని వెనక కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. జ్యోతిషశాస్త్ర పరంగా మకర సంక్రాంతి సూర్యుడు మకరరాశిలోకి మారడాన్ని సూచిస్తుంది. సాంప్రదాయకంగా జనవరి 14న నిర్వహించుకుంటూ వస్తున్నారు. అయితే ఈ తేదీలో సంక్రాంతి పండుగను ఎక్కువగా చేసుకునేవారు…
జ్యోతిషశాస్త్రపరంగా సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు సంక్రాంతి వస్తుంది. ఈ ప్రక్రియ ప్రతి 30 రోజులకు ఒకసారి జరుగుతుంది. ఈ పండుగ ప్రత్యేకంగా మకరరాశిలోకి సూర్యుని ప్రవేశాన్ని సూచిస్తుంది. గతంలో సాధారణంగా జనవరి 14న ఈ పండుగ జరిగేది.

అయితే ప్రతి 71-72 సంవత్సరాలకు సూర్యుని వేగంలో స్వల్ప మార్పు దాని రాశిచక్రం మారే సమయంలో ఒక రోజు మార్పును తీసుకొస్తుంది. ఈ కారణంగా ఈ ఏడాది జనవరి 15న సంక్రాంతి పండుగ వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. గతంలో జనవరి 12-13 తేదీల్లో మకర సంక్రాంతిని చేసేవారని.. క్రమంగా పండుగ తేదీ మారిందని అంటున్నారు. అయితే మకర సంక్రాంతిని జనవరి 15న స్థిరంగా జరుపుకొనే భవిష్యత్తు ట్రెండ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈసారి లీప్ సంవత్సరం కారణంగా కూడా పండుగ తేదీలో మార్పు వచ్చింది..

*2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమయింది. అంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే పండుగ. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాతకు మారుతుంది.*

*1935 నుండి 2007 వరకు జనవరి 14న,*
*2008 నుండి 2080 వరకు జనవరి 15న,*
*2081 నుండి 2153 వరకు జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుంది.*

*ఎందుకిలా అంటే, సాధారణంగా, సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిననాడే మకర సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు నుండి మిధునరాశి లోకి ప్రవేశించేదాకా ‘ఉత్తరాయణ పుణ్యకాలం’గా వ్యవహరిస్తారు.*

*ఇక, సూర్యుడు ప్రతీ సంవత్సరం మకర సంక్రమణం చేసినప్పుడు 20 నిమిషాలు ఆలస్యం అవుతోంది. స్థూలగణన ఆధారంగా ఇది మూడు సంవత్సరాలకు ఒక గంట, 72 ఏళ్లకు ఒక రోజుగా మారుతోంది.*

*ఈ లెక్కన, ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ ప్రకారం, 72 ఏళ్లకొకసారి సంక్రాంతి తర్వాతి రోజుకు మారుతుంది. జనవరి 16న సంక్రాంతి రావడం ఎలాగూ మనం చూసే అవకాశం లేదు.*

*💥భోగి పండుగ విశిష్టత*

మన బాహ్య నేత్రాలకు కనిపించదు కానీ తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లలు జ్ఞానవంతులవుతారు.*

ఈ సంప్రదాయంలో పర్యావరణ పరిరక్షణ అంశం కూడా ఉంది. భోగిపండ్లు, చెరుకు ముక్కలు, రూపాయి బిళ్ళలు, పువ్వులు మొదలైనవి కలిపి పోస్తారు. చెరుకు, పూలు, పండులు ఇవన్నీ ప్రకృతికి సంకేతం. వీటిని తలమీద పోయడం అంటే ప్రకృతిని నెత్తిన పెట్టుకోండి, రక్షించండి, వృద్ధి చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అని అర్ధం. ఈ పూలు, పండ్ల మిశ్రమాన్ని తలమీద పోయడం వలన పిల్లల జీవితాలకు రక్షణ కలుగుతుంది, చెడు ప్రభావం తొలగిపొతుంది, అభివృద్ధి జరుగుతుంది. అంటే ప్రకృతిని, భూగోళాన్ని రక్షించడం వల్లనే మనకు రక్షణ ఉంటుంది, అభివృద్ధి జరుగ్తుంది అనేది #అంతరార్ధం.*
*ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి , మామిడి , మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. దీనితో భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వల్ల వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

*ఇక ఆధ్యాత్మిక పరంగా ఈ భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు. వాస్తవానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు మనలోని పనికి రాని అలవాట్లు చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం , విజయాలు వస్తాయి అనే అర్ధం ఈ భోగి మంటల వెనుక ఉంది. ఈ భోగి రోజున మొదలయ్యే పెద్ద పండుగలో అరిసెలు నువ్వుల లడ్డు జంతికలు చక్కలతో పాటు రకరకాల పిండి వంటలతో మ న ఇరు రాష్ట్రాలలోని తెలుగు వారు ఎంతో ఆనందంగా చేసుకునే ఈ భోగి పండుగతో మూడు రోజుల పెద్ద పండుగ ప్రారంభం అవుతుంది.*