సపోటాతో ఎన్ని ప్రయోజనాలో…..

సపోటాతో ఎన్ని ప్రయోజనాలో..
〰〰〰〰〰〰〰〰
సపోటాలో A, C విటమిన్ లభిస్తుంది. కంటి చూపుకు మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది..
తక్షణ శక్తిని ఇస్తుంది.
రక్తపోటును నియంత్రించే గుణం ఉంది.
ఇందులో లభించే ఫైబర్ మలబద్దకం సమస్యను నివారిస్తుంది.
జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది.
స్థూలకాయ సమస్యకు సపోటా విరుగుడుగా పనిచేస్తుంది.
జుట్టు రాలే సమస్యను అరికడుతుంది.

*.గోధుమ గడ్డి జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో..*
〰〰〰〰〰〰〰〰
► గోధుమ గడ్డిలో ప్రొటీన్, ఫ్లేవనాయిడ్స్, క్లోరోఫిల్, విటమిన్ సి, ఇ, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజు గోధుమ గడ్డి జ్యూస్‌ తాగితే పోషకాల లోపం తీరుతుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు వస్తాయి. కాలేయం సక్రమంగా పనిచేసి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా?*
〰〰〰〰〰〰〰〰
☛ అరటిపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గ్యాస్ ను నియంత్రణలో ఉంచుతుంది. అరటిపండ్లు తినడం వల్ల ఎసిడిటీ రాదు.
☛ పుచ్చకాయ తినడం వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
☛ దోసకాయ తీసుకుంటే కడుపులో మంట తగ్గుతుంది.
☛ గ్యాస్ నుంచి ఉపశమనం పొందడంలో అంజీర్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఒత్తిడి, ఆందోళన చెందుతున్నారా?*
〰〰〰〰〰〰〰〰
☛ ఎప్పుడెప్పుడు ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారో డైరీలో నమోదు చేసుకోండి.
☛ ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటి మానసిక విశ్రాంతి కలిగించే పద్ధతులు పాటించండి.
☛ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
☛ సమయానికి పడుకుని కంటి నిండా నిద్రపోండి.
☛ కాఫీ, కూల్‌డ్రింకులు తాగటం మానెయ్యండి.
*సమస్యను అర్థంచేసుకొని, బయటపడటానికి తోడ్పడే స్నేహితుల సహకారం తీసుకోండి.

జొన్న రొట్టెలతో ఎంతో మేలు*
〰〰〰〰〰〰〰〰
☛ పూర్వం ప్రతి ఒక్కరూ జొన్న రొట్టెలు తినేవారు. అందుకే ధృడంగా ఉండి అలసిపోకుండా పనులు చేసేవారు.
☛ జొన్నల్లో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ బీ3 ఉంటాయి.
☛ వీటితో చేసిన రొట్టెలు తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ పనితీరు మెరుగుపడుతుంది. ఎముకలు బలపడతాయి. బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను పెంచి మలబద్దకం దూరమవుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

. లిచీ పండ్లు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో..*
〰〰〰〰〰〰〰〰
☛ ఈ పండులో పొటాషియం చాలా ఎక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది.
☛ లిచీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
☛ పక్షవాతం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
☛ జీర్ణ సమస్యలను తొలగిస్తుంది.
☛ చర్మం రంగు మెరుగుపడుతుంది.
☛ జ్వరం, జలుబు, గొంతునొప్పి వంటి వ్యాధులను తగ్గిస్తుంది.

ఉదయాన్నే ఇలా చేస్తే రోజంతా హ్యాపీనే*
〰〰〰〰〰〰〰〰
► ఉదయాన్నే టీ, కాఫీలు కాకుండా నిమ్మరసం/మంచినీళ్లు ఆరోగ్యానికి మంచివి. కనీసం 45నిమిషాలు వ్యాయామం చేయండి. పోటీ పరీక్షల సమయం కాబట్టి న్యూస్ పేపర్ చదివితే నాలెడ్జ్ పెరుగుతుంది. వీలైతే పుస్తకాలు కూడా చదవండి. మైండ్ రిలాక్స్ అవుతుంది. టిఫిన్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఉదయాన్నే కొంత జ్ఞానం సంపాదించుకున్నామన్న ఆలోచనే మిమ్మల్ని రోజంతా హ్యాపీగా ఉంచుతుంది.

చేపలను తినడం వల్ల కలిగే లాభాలు*
〰〰〰〰〰〰〰〰
✶ అల్జీమర్స్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు
✶ జ్ఞాపకశక్తి పెరుగుతుంది
✶ గుండె జబ్బులను నివారిస్తుంది
✶ డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్స్‌ను తగ్గిస్తాయి
✶ కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి
✶ స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా జరుగుతుంది
✶ రక్తాన్ని శుద్ధి చేస్తాయి
✶ పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ సహా పలు క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.

. హ్యాపీ హార్మోన్ కోసం ఇవి తినండి*
〰〰〰〰〰〰〰〰
► ఒత్తిడికి లోనవడం, మానసిక కుంగుబాటు, పనులపై ఆసక్తి తగ్గిందంటే.. శరీరంలో ఉత్పత్తయ్యే హ్యాపీ హార్మోన్ ‘సెరటోనిన్’ స్థాయి తగ్గినట్లు గుర్తించాలి. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు తీసుకుంటే వీటిలో ఉండే అమినో యాసిడ్.. సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఉదయం వేళ సూర్యరశ్మిలో నిల్చోవడం, B విటమిన్, మెగ్నీషియం ఉండే కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, అరటి పండ్లు తింటే హ్యాపీ హర్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది.