..సరిపోదా శనివారం’ అంటున్న నాని..

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఆకట్టుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవలనే హాయ్‌ నాన్న’తో ఈ ఏడాది మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నాని…ఆ సినిమా విజయాన్ని ఆస్వాదించి అమెరికా నుంచి ఇటీవలే తిరిగొచ్చారు. వెంటనే కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ కోసం రంగంలోకి దిగారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో… డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రమిది. నాని సరసన కథానాయిక ప్రియాంక మోహన్‌ నటిస్తోంది. ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోసిస్తున్నారు.
. ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుందరానికీ’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’.. ఇలా ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. దర్శకుడు వివేక్ ఆత్రేయతో ‘అంటే సుందరానికీ’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేసిన నాని.. ఇప్పుడు ఆ దర్శకుడితో మరోసారి చేతులు కలిపారు. ఈసారి మరో వెరైటీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

డి.వి.వి.దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ఇటీవలనే హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ చిత్రీకరణని ప్రారంభించారు. సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్‌లో కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలతోపాటు ప్రధాన తారాగణంపై టాకీ భాగాన్ని చిత్రీకరించనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ”యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. నాని మాస్‌ అవతారంలో కనిపిస్తారు. తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ”ని చెప్పాయి సినీ వర్గాలు..