మహిళా రిపోర్టర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన మగ ‘రోబో’!..

సౌదీ అరేబియా (Saudi arabia) రాజధాని రియాద్‌లో రెండు రోజుల క్రితం సౌదీ అరేబియాకు చెందిన తొలి మగ హ్యూమనాయిడ్ రోబోట్(saudi first male robot)’ఆండ్రాయిడ్ ముహమ్మద్’ ఆవిష్కరించబడింది..కానీ,ఈ సమయంలో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్ కు గురి చేసింది. సోషల్ మీడియాలో దీనిపై వివాదం కూడా చెలరేగింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

సౌదీ అరేబియా యొక్క మొదటి హ్యూమనాయిడ్ రోబో ‘ఆండ్రాయిడ్ ముహమ్మద్(Android Muhammad)’ గురించి కవర్ చేయడానికి రిపోర్టర్ రవ్యా అల్-ఖాసిమి వచ్చారు. ఖాసిమి ఆ రోబో పక్కనే నిలబడి లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో.. రోబోట్ అకస్మాత్తుగా మహిళా రిపోర్టర్ వెనుక భాగాన్ని ‘అభ్యంతరకరమైన’ పద్ధతిలో టచ్ చేసింది. ఇది జరిగిన వెంటనే రిపోర్టర్ అల్-ఖాసిమి అసౌకర్యానికి గురైంది. రోబోట్ యొక్క ఈ చర్యను లైంగిక వేధింపుగా చెప్పవచ్చు. ఎందుకంటే, రోబో మగ, రిపోర్టర్ ఆడ కాబట్టి..ఈ వీడియోను TansuYegen అనే నెటిజన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అయింది. రోబో ప్రోగ్రామింగ్ లేదా నియంత్రణపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిపోర్టింగ్ సమయంలో చాలా దగ్గరగా వచ్చారని దీంతో రోబోట్ ఆమెని ముందుకు వెళ్లమని సూచించడానికి అటువంటి సహజ కదలికను చేసిందని కొందరు నెటిజన్లు..రోబోలకు ఫీలింగ్స్ వస్తే పరిస్థితి ఇలాగే ఉంటదని..ఈ రోబోకి ఇదేం పాబుబుద్ది..ఇదెక్కడి యవ్వవారం రా అయ్యా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కాముెంట్స్ చేస్తున్నారు..నిజం ఏదైనా కావచ్చు.. మొదటి చూపులో ఇది అసభ్యకరమైన చర్యగా అనిపిస్తుంది. ఈ వీడియో వైరల్ అవడంతో AI-అనుకూలమైన రోబోల ఊహ-ప్రమాదాల గురించిన ఆందోళనలు కూడా సోషల్ మీడియాలో వక్తమవుతున్నాయి. కాగా, ఇంతకు ముందు కూడా రోబోలు తప్పులు చేయడం చూశాం. ఈ వైరల్ వీడియో.. అటువంటి టెక్నాలజీని డెవలప్ చేస్తున్నప్పుడు నైతిక పరిగణనల ప్రాముఖ్యత గురించి కూడా ప్రశ్నలను లేవనెత్తుతుంది..