ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్‌ విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మృతి…!.

*సూర్యాపేట జిల్లా :……….*

సూర్యాపేట మండలంలోని ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి ఇంటర్‌ విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మృతి…

సూర్యాపేట పట్టణానికి చెందిన వెంకన్న, భాగ్యమ్మల కుమార్తె దగ్గుపాటి వైష్ణవి (17) గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది…

గురుకుల పాఠశాలలో శనివారం ఫేర్‌వెల్‌ డే ఉండగా విద్యార్థిని తండ్రి ఉదయం 9గంటలకు వచ్చి పూలు , గాజులు ఇచ్చి వెళ్లాడు. సాయంత్రం పాఠశాల ఆవరణలో జరిగిన ఫేర్‌వెల్‌డేలో వైష్ణవి పాల్గొన్నది. అయితే ఈ కార్యక్రమం జరుగుతుండగానే వైష్ణవి హాస్టల్‌ గదికి వెళ్లిపోయింది. గంట తర్వాత తోటి విద్యార్థులు వెళ్లి చూడగా వైష్ణవి అపస్మారకస్థితిలో ఉంది.…

హాస్టల్‌ గదిలో వైష్ణవి అపస్మారకస్థితిలో ఉండగా సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి రాత్రి తరలించారు…

విషయాన్ని వారు వెంటనే ప్రిన్సిపల్‌తో పాటు సిబ్బందికి చెప్పడంతో వైష్ణవిని సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. హాస్టల్‌ సిబ్బంది ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా తెలియజేయడంతో వారు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. తమ కూతురును విగతజీవిగా చూసి బోరున విలపించారు. శనివారం సాయంత్రం పాఠశాలలో జరిగిన ఫేర్‌వెల్‌ డేకు వెళ్లేందుకు తయారైన తర్వాత వీడియో కాల్‌ చేసి తమతో నవ్వుతూ మాట్లాడిందని విద్యార్థిని తల్లిదండ్రులు వెంకన్న, భాగ్యమ్మ రోదిస్తూ తెలిపారు..

వైష్ణవి మృతి పై నిజంల నిర్ధారణ చేసి బాద్యుల పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని గురుకుల పాఠశాల ముందు బైఠాయించి ఆందోళనకు దిగిన వైష్ణవి కుటుంబసభ్యులు , బంధువులు . సూర్యాపేట పెన్పహాడ్ రహదారి పై రాస్తారోకో ట్రాఫిక్ జామ్..