1 నుంచి 12 వరకు బడిబాట.13న పాఠశాలలు పునఃప్రారంభం.

*1 నుంచి 12 వరకు బడిబాట..*13న పాఠశాలలు పునఃప్రారంభం..
*ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన*
*కార్పొరేటకు దీటుగా మౌలిక సదుపాయాల కల్పన
*విద్యార్థులను సర్కారు బడుల వైపు ఆకర్షించేలా చర్యలు

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకుగానూ జూన్ 1 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.జూన్ 13వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో 12 వరకు బడిబాట కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిన విషయం తెలి సిందే, ఐడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించడంతో పాటు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపె దున్న వివరాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించ నున్నారు. సర్కారు బడుల్లో పెరుగనున్న ప్రవేశాలు సర్కారు బడుల్లో ఈసారి భారీగా ప్రవేశాలు పెరిగే అవ కాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. పాఠశాలల పునఃప్రారంభం నాటికి చాలావరకు పనులు పూర్తి కానున్నాయి.
అలాగే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం తరగ తులు ప్రారంభం కానున్నారు. ఆకర్షణీయమైన పాఠ శాల భవనం, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా చూడటంతో పాటు విద్యార్థులను పాఠశాల వైపు ఆకర్షి తులను చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేప డుతోంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం లేక అధిక శాతం తల్లిదం డ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులు కల్పించడంతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభం కానున్న నేప ధ్యంలో ఈసారి ప్రవేశాలు గణనీయంగా పెరుగనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపా ధ్యాయులతో బోధన, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నారు. దాంతో పిల్లల చదువు కోసం తల్లిదండ్రులపై ఎలాంటి ఆర్థిక భారం పద కపోగా, విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించనుంది.

*కరోనాతో పెరిగిన ప్రవేశాలు*

రాష్ట్రంలో 2021 22 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠ శాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ విద్యా సంవత్సరంలో 2.30 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. కరోనా నేపథ్యంలో ఆర్థికస్థోమత సరిగా లేకనో,సర్కారు బడిలోనూ విద్యను బాగా చెప్తారనే ఉద్దేశంతోనో… చాలా మంది తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ల నుంచి సర్కారు ఐదులకు మార్చారు. కుటుంబాల ఆదా యాలు తగ్గడం, ప్రైవేట్ ఆన్లైన్ తరగతులకూ భారీగా ఫీజులు వసూలు చేస్తుండడంతో ప్రభుత్వ పాఠ శాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటకు ఒకటే సిలబస్ ఉన్న నేపథ్యంలో ఫీజుల భారం మోయలేక తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించారు. సర్కారు బడుల్లో విద్యార్థులను చేర్పించడం వల్ల తల్లిదండ్రులకు ఫీజుల నుంచి ఉపశమనం లభిం చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగ తిలో ఈ విద్యాసంవత్సరం సుమారు 1,30 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అలాగే వివిధ శాఖల పరిధిలో నడుస్తున్న గురుకులాల్లో ఐదు, ఇతర తరగ తుల్లో భారీగా విద్యార్థులు చేరారు. సాధారణ ప్రభుత్వ పాఠశాలలతో పాటు విద్యాశాఖ పరిధిలోని మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కెజిబి వి)లో విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 2019 20లో 68,813 కాగా.. గత ఏడాది (2020 21) దాదాపు లక్ష మంది ఉంటారు. కరోనా కారణంగా ప్రవే శాలు పెరిగినప్పటికీ ఆ విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠ శాలల్లోనే కొనసాగించేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధన చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.