విద్యార్థిని చెత్త డబ్బాలో పెట్టి – మూతవేసి శిక్షించిన ఉపాధ్యాయుడు..

*అంతర్వేది పాలెం జడ్పీ హై స్కూల్లో సంఘటన… విద్యార్థి సంఘాలు, స్థానికులు ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు..

విద్యార్థులకు క్రమ శిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయులు క్రమశిక్షణ తప్పుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం మధ్య గ్రూప్ జడ్పీ హైస్కూల్లో ఒక విద్యార్థి పై ఉపాధ్యాయుడు కర్కశంగా వ్యవహరించారు. గురువారం ఐదవ తరగతి చదువుతున్న గెడ్డం రాజమౌళి అనే విద్యార్థి క్రమ శిక్షణ తప్పినట్లు భావించి పాఠశాలలో ఉన్న చెత్త బుట్టలో సుమారు 45 నిమిషాలు కూర్చోబెట్టి మూత పెట్టిన సంఘటన వెలుగులోకి రావడంతో పాఠశాల వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. తరగతిగదిలో ఎవరో చేసిన తప్పుకి తనని భాద్యులుగా చేస్తూ తనను చెత్త బుట్టలో పెట్టారని బాధిత విద్యార్థి వాపోయారు.చివరకు తన సోదరీ వచ్చి మూత తీసిందని విద్యార్థి కన్నీళ్లు పెట్టుకొన్నాడు. విద్యార్థి సంఘాల నాయకులు నేతల నానీ, రాపాక మహేష్, వైసీపీ నేత సహాదేవ్ తో పాటు స్థానిక యువత ఆందోళనలో పాల్గొని ఉపాధ్యాయుడు అల్విన్ బాబా పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..