శ్రీకాకుళం జిల్లాలో స్కూల్‌ బస్సు చెరువులో బోల్తాపడి విద్యార్ధి మృతి.

శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని నల్ల చెరువులో.. కొంగర గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు ఒక్కసారిగా చెరువులో బోల్తా పడడంతో విద్యార్థులకు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఓ విద్యార్థి బస్సు కింద పడి స్పాట్‌లోనే మృతిచెందాడు. మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. పిల్లల అరుపులు, గాయాల బాధలతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. మిగిలిన విద్యార్థులను చెరువులో నుంచి ఒక్కొక్కరిని బయటకు తీసి చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థి బడివానిపేటకు చెందిన 8 ఏళ్ల మైలపల్లి రాజుగా గుర్తించారు. చెరువులో బోల్తా పడిన బస్సును జేసీబీ సహాయంతో బయటకు తీశారు…సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద గురించి తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు, సమీప గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో చెరువు వద్దకు చేరుకుని, సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులు ఘనటపై ఆరా తీశారు. గాయపడ్డ పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై నివేదిన ఇవ్వాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించారు..