ఈనెల 22న సెలవు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం..

జనవరి 22వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని డిమాండ్ వినబడుతోంది. అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాలు సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. దేశంలో గొప్పగా జరగబోతోన్న ఈ వేడుకలకి యూపీ, గోవా, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు.. జనవరి 22వ తేదీన అందరూ పండుగ జరుపుకోవాలని సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి….

అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరుపుతున్న కార్యక్రమం కారణంగా జనవరి 22 న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సగం రోజు సెలవు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థల్లోని ఉద్యోగులకు జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల వరకు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. ఉద్యోగులు ఆ వేడుకల్లో పాల్గొనడానికి వీలుగా, అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిపే కార్యక్రమాన్ని వీక్షించడానికిక వీలుగా భారతదేశం అంతటా ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలను 2024 జనవరి 22 న మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇక పలు రాష్ట్రాలలో కూడా జనవరి 22 న సెలవు ప్రకటించారు.

అయోధ్యలో రామ్ మందిర్‌లో విగ్రహం మహా ప్రతిష్ఠాపన జరగనున్న రోజు సోమవారం (22న) సెలవు దినంగా మహారాష్ట్ర శుక్రవారం ప్రకటించింది.

హోమ్ మంత్రిత్వశాఖ కేటాయించిన అధికారాలను వినియోగిస్తూ 22న సెలవు దినంగా ప్రకటించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఒక ఉత్తర్వులో తెలియ జేసింది.

రామ్ మందిర్‌లో ‘ప్రాణ్ ప్రతిష్ట్’ సందర్భంగా దేశం అంతటా తన కార్యాల యాలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలకు 22న అర రోజు సెలవు ఉంటుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

అదే సందర్భంలో 22న తన కార్యాలయాలు అన్నిటినీ మూసివేయనున్నట్లు చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది.

కాగా, సోమవారం అర రోజు సెలవును హర్యానా ప్రభుత్వం ప్రకటించింది…

22న ఉత్తరప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. ఈనెల 22నన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం దృష్టా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రామజన్మభూమి ఆలయంలో శ్రీరామ్‌లల్లా ‘ప్రాణ-ప్రతిష్ఠ’ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను సీఎం ఆదిత్యనాథ్‌ పరిశీలించారు..

21వ తేదీ వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం సమంజసం కాదని.. 22వ తేదీన కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నా.. ఉద్దేశపూర్వకంగానే ఆరోజు సెలవు ఇవ్వలేదన్న ఏపీ బీజేసీ చీఫ్‌ పురందేశ్వరి తెలిపారు. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయని పురందేశ్వరి గుర్తుచేశారు…