సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినం గా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల..

*🔹సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినం గా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల..

లోక్‌సభ ఎన్నికలు ఇలాంటి టైంలోనే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో వివాదానికి కారణమవుతున్న సెప్టెంబర్‌ 17ను అధికారికం చేసింది. ఇకపై ఆ రోజును “హైదరాబాద్‌ లిబరేషన్ డే”గా నిర్వహించాలని కేంద్రం గెజిట్‌ జారీ చేసింది. సెప్టెంబర్‌ 17న అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని దీన్ని స్వేచ్ఛకు గుర్తుగా ప్రజలను భాగస్వాములను చేయాలని ఎప్పటి నుంచో బీజేపీతోపాటు చాలా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకుంటూ వచ్చారు. ఏ పార్టీకి నచ్చినట్టు ఆ పార్టీ దీనికో పేరు పెట్టుకొని వేడుకలు చేస్తుంటాయి. కొందరు విమోచన దినోత్సవం అంటే.. మరికొందరు విలీన దినోత్సవం అంటారు. ఇంకొందరు విద్రహో దినంగా అభివర్ణిస్తుంటారు.