సేవ దాస్ బంజారా సినిమాను ఆదరించండి..ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి…

సేవ దాస్ బంజారా సినిమాను ఆదరించండి..ఎమ్మెల్యే సైదిరెడ్డి.
హుజుర్ నగర్.

శ్రీ శ్రీ శ్రీ హాతిరం బాలాజీ క్రియేషన్ పతాకంపై నిర్మించిన బంజార బహుభాషా చిత్రం సేవాదాస్ సినిమా పోస్టర్ ని ఈ రోజు హుజూర్ నగర్ గౌరవ శాసన సభ్యులు శానంపుడి సైదిరెడ్డి గారి చేతుల మీదుగా సినిమా పోస్టర్ ను హుజుర్నగర్ mla క్యాంపు ఆపీస్ నందు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హుజుర్నగర్ గౌరవ శాసనసభ్యులు సైదిరెడ్డి మాట్లాడుతూ బంజారాల సంస్కృతి. సాంప్రదాయాలు,పండుగలు, ఆచారాలు, అలవాట్లు ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ ఒకటిన ప్రపంచవ్యాప్తంగా విడుదల విడుదల అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్క బంజార బిడ్డ చూసి విజయవంతం చెయ్యాలని ఆయన అన్నారు..బంజారా జాతి ఈ రోజు అన్ని రంగాలలో రాణించడం గొప్ప విషయం అని, తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ లో బంజారా హుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పేరుతో సంస్థ ను నమోదు చేయించి మరెన్నో సినిమాలు తీసేలా వారు చేస్తున్నా కృషి అభినందనీయం అని పేర్కొన్నారు .

ఈ కార్యక్రమంలో అడ్వకేట్ నగేష్ రాథోడ్,
మధు నాయక్, వెంకటేశ్వర్లు, హమ్ బంజారా రాం లక్ష్మణ్, తులసిరాం, నాగరాజు, మణికంఠ నాయక్ , జిలేందృడు, సైదా, అమర్నాథ్ రెడ్డి, రాజా నాయక్*,,అంజి నాయక్ మరియు తదితరులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.