రేపు శాకాంబరీ దేవి జయంతి , శాకాంబరీ దేవి పూర్ణిమ..

_*రేపు శాకాంబరీ దేవి జయంతి , శాకాంబరీ దేవి పూర్ణిమ*_

శాకాంబరీ దేవి అనగా దుర్గ దేవి యొక్క మరో అవతారం. శాకాంబరీ జయంతి ని జనవరి మాసం లో జరుపుకుంటారు. దీనిని శాకాంబరీ పూర్ణిమ గా వ్యవహరిస్తారు. ఈ పండుగను భారతదేశం మొత్తం జరుపుకుంటారు. హిందూ సంప్రదాయం లో దుర్గ దేవి కి అధిక ప్రాధాన్యం ఇస్తారు.

దుర్గ దేవి అనేక అవతారాలలో ముఖ్యమైన అవతారం శాకాంబరీ దేవి. శాకాంబరీ దేవి పూలు , పండ్లు , మరియు పచ్చదనం కి అది దేవత గా భావిస్తారు. శాకాంబరీ ఉత్సవాలు తొమిది రోజులు జరుపుతారు ఆఖరి రోజు ముఖ్యమైన రోజు అనగా శాకాంబరీ పూర్ణిమ. అదే రోజు పుష్య పూర్ణిమ.
పూర్వం చాల రోజులు భూమి మీద వర్షం లేకపోవడం వల్ల భూమి మీద మానవులు , పక్షులు , జంతువులూ ఇంకా అనేక జీవులు మరణించాయి . అప్పుడు మహా మునులు దుర్గ దేవి ని వేడుకున్నారు . ఆమె అపుడు శాకంబరీ అవతారం లో వర్షం కురిపించి భూమి మీద కరువు ని పారద్రోలింది. అప్పటి నుంచి భారతదేశం లో శాకాంబరీ జయంతి ని జరుపుతారు…
కర్ణాటక , మహారాష్ట్రా , ఉత్తరప్రదేశ్ , రాజస్థాన్ , హిమాచల్ ప్రదేశ్ అనేక ప్రాంతాలలో ఉత్సవాలు అంబరాన్ని తాకుతాయి. చెన్నై లో ని శాకాంబరీ పురం లో ని శాకాంబరీ ఆలయం లో ఉత్సవాలు తొమ్మిది రోజు జరుపుతారు.

*పుష్య పూర్ణిమాలో ముఖ్యమైన సమయాలు*

సూర్యోదయం జనవరి 28, 2021 7:12 ఉదయం
సూర్యాస్తమయం జనవరి 28, 2021 6:07 అపరాహ్నం
పూర్ణిమ తిథి ప్రారంభమైంది జనవరి 28, 2021 1:17 ఉదయం
పూర్ణిమ తిథి ముగుస్తుంది జనవరి 29, 2021 12:46 ఉదయం