శబరిమల అయ్యప్ప ఆలయంలో జరిగే అన్నదానం కార్యక్రమానికి భారత్ బయోటెక్ ఎండీ డా. కృష్ణ భారీ విరాళం…

శబరిమలలో అన్నదానానికి భారత్​ బయోటెక్​ ఎండీ భారీ విరాళం.

శబరిమల అయ్యప్ప ఆలయంలో జరిగే అన్నదానం కార్యక్రమానికి భారత్ బయోటెక్ ఎండీ డా. కృష్ణ భారీ విరాళాన్ని అందించారు. మంగళవారం ఆయన తన భార్య సుచిత్ర కలిసి శబరిమల ఆలయాన్ని సందర్శించారు. అనంతరం రూ. కోటి విరాళాన్ని శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి. కృష్ణకుమార్ వారియర్కు ఆన్ లైన్ లో అందజేశారు. విరాళం చేసినందుకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు అనంతగోపన్ .. కృష్ణ ఎల్లకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. శబరిమల అభివృద్ధికి, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.