సీఎం కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీపై స్పందించిన షబ్బీర్ అలీ..

కామారెడ్డి, గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ పోటీపై సెటైర్లు వేశారు షబ్బీర్‌ అలీ. గజ్వేల్‌లో ఓడిపోతానన్న భయంతోనే కామారెడ్డిలోనూ సీఎం కేసీఆర్‌ పోటీ చేస్టున్నట్టు తెలుస్తోందన్నారు. రెండు చోట్ల కేసీఆర్‌ ఓడిపోతారని జోస్యం చెప్పారు. కామారెడ్డిలో ఎవరు పోటీ చేసినా గెలుపు తనదేనంటూ ధీమా వ్యక్తం చేశారు షబ్బీర్‌ అలీ. కామారెడ్డిలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారో కేసీఆర్‌ వెల్లడించాలని, ఆ తర్వాతే నామినేషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో పోటీ చేయడమే కేసీఆర్‌ చివరి రాజకీయ జీవితమంటూ చురకలు అంటించారు షబ్బీర్‌ అలీ..