శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రద్దీ.


కొవిడ్‌ మహమ్మారి కారణంగా కొంత కాలంగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గిన విషయం తెలిసిందే. ఇటీవల దేశం, రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు తగ్గిన నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రద్దీ పెరిగింది. గత నెలలో 65 శాతం ఉన్న ఆక్యుపెన్సీ రేషియో అక్టోబర్‌ 9కి 77శాతానికి పెరిగిందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి అన్ని దేశీయ విమానాశ్రయాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. జూలైలో 6.8లక్షల మంది దేశీయ ప్రయాణికులు ప్రయాణించగా సెప్టెంబర్‌లో వారి సంఖ్య 9.3లక్షలు ఉందని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య గననీయంగా పెరిగిందని అధికారులు పేర్కొన్నారు.