శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌…

విదేశీ చదువులకై భారీ స్థాయిలో విద్యార్థులు తరలి వెళ్లడంతో కూడా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ స్థాయిలో విద్యార్థులు తల్లిదండ్రులు, బంధువులతో ఏర్పాటు మొత్తం కితకితలు ఆడిపోయింది…

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ఆగస్టు 15 వరకూ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌ విధించారు. ఈ క్రమంలో అప్పటి వరకూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌), పోలీసులతో తనిఖీలను ముమ్మరం చేయనున్నారు. అంతేకాకుండా, ఆగస్టు 15 వరకు సందర్శకులకు అనుమతి నిరాకరిస్తున్నట్లుగా ప్రకటించారు….


విమానాలు ఎక్కే ప్రయాణికులతో పాటు వారిని సాగనంపడానికి కుటుంబ సభ్యులు ఎయిర్ పోర్టుకు వస్తుండే సంగతి తెలిసిందే. అయితే, ఈ హైఅలర్ట్ నేపథ్యంలో ఒకరిద్దరే రావాలని ఎయిర్ పోర్టు అధికారులు సూచిస్తున్నారు. అన్ని రకాల పాసులను ఆగస్టు 16 వరకూ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
విమానాశ్రయంలో పార్కింగ్, డిపాశ్చర్, ఆగమనాలు విభాగాల్లో సీఐఎస్ఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు మొదలు పెట్టారు. విదేశాలకు వెళ్తున్న ప్రయాణికులకు వీడ్కోలు పలకడానికి ఒకరు లేదా ఇద్దరు సందర్శకులు రావాలని.. అంతేకానీ, అధిక సంఖ్యలో వస్తే అనుమతించబోమని అధికారులు చెబుతున్నారు.

అత్యధిక స్థాయిలో చదువులకు ప్రయాణం.

ఈ ఏడాది హైయ్యర్ స్టడీస్ కోసం ఎక్కువ మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. ఇలా విదేశాలకు వెళ్లే విద్యార్థుల రాకతో సందర్శకులు కూడా వస్తున్నారు…తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అందుకే, భద్రత నేపథ్యంలో వచ్చే 15 రోజులు సందర్శకులు రావద్దని కేంద్ర బలగాలు అలర్ట్ చేస్తున్నాయి..
కేవలం పార్కింగ్ వరకే తల్లిదండ్రులను కానీ బంధువులను కానీ అనుమతిస్తున్నారు..

భారీగా పెరిగిపోతున్న ట్రాఫిక్…

విదేశీ చదువులకు వెళుతున్న విద్యార్థులు పంపించడానికి భారీ స్థాయిలో బంధువులు తల్లిదండ్రులు అందరు రావడంతో భారీగా ట్రాఫిక్ పెరిగిపోయింది.. స్పెషల్ అధికారాలు పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో కొంత ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది… పార్కింగ్ ఏరియా మొత్తం కూడా పూర్తిగా వాహనాలతో నిండిపోయింది…