హైదరాబాద్..
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. మంగళవారం ఉదయం గుర్తు తెలియని ఆగంతకుడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబు పెట్టినట్లు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెప్పాడు.
దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎయిర్ పోర్ట్‌లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బాంబు స్వ్కాడ్ విస్తృత తనిఖీల అనంతరం బాంబు లేదని అధికారులు నిర్థారించారు.
బాంబు బెదిరింపు కాల్ ఫేక్‌గా అధికారులు గుర్తించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఫోన్ కాల్ చేసిన వ్యక్తి కోసం దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు..