ఆసీస్ లెజెండ్ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం…

థాయిలాండ్‌లోని తన విల్లాలో తీవ్ర గుండెనొప్పితో క్రికెట్ స్పిన్నర్ షేన్ వార్న్ మరణించినట్లు తెలుస్తోంది… షేన్‌వార్న్(52) తన విల్లాలో అచేతనంగా పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వార్న్ మరణ వార్త తెలిసి.. క్రికెట్ ప్రముఖులతో పాటు ఆయన ఫ్యాన్స్ దిగ్భ్రాంతి గురవుతున్నారు… షేన్ వార్న్ ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 5 వికెట్లు 37సార్లు, 10 వికెట్లు పదిసార్లు తీశాడు. ఐపీఎల్‌లో నాలుగేళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 55 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 57 వికెట్లు సాధించాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ వార్న్. అటు ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు..