జర్నలిస్ట్ శంకర్ పైన జరిగిన హత్యాయత్నం వెనకనున్నది సీఎం రేవంత్ రెడ్డినే.- కేటీఆర్.

జర్నలిస్ట్ శంకర్ పైన జరిగిన హత్యాయత్నం వెనకనున్నది సీఎం రేవంత్ రెడ్డినే.- కేటీఆర్..

•కొడంగల్ లో జరుగుతున్న రైతుల భూకబ్జాల పైన నిజాలు వెల్లడించినందుకే శంకర్ పైన దాడి..
•భవిష్యత్తులో శంకర్ కి హాని జరిగితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాల్సి వస్తుంది..
•జర్నలిస్ట్ శంకర్ ను తుర్కయంజాల్ లోని ఆయన ఇంటిలో పరామర్శించిన కేటీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు..

•శంకర్ పై జరిగిన దాడి విషయంలో పోలీస్ అలసత్వాన్ని, ప్రభుత్వ పక్షపాత వైఖరిని ప్రధాన ప్రతిపక్షంగా ఎండగడతామని హెచ్చరించిన కేటీఆర్ ..

ఆదివారం సాయంత్రం కెటిఆర్ తుర్కయంజల్‌లోని శంకర్ ఇంటికి వెళ్లి, ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కెటిఆర్ వెంట పలువురు బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ ని పరామర్శించి భరోసాని ఇచ్చారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, శంకర్‌పై జరిగిన దాడికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యతవహించాలని అన్నారు.

భవిష్యత్తులో జర్నలిస్టు శంకర్‌కు ఎట్లాంటి హాని జరిగినా దానికి పూర్తి బాధ్యులు రేవంత్ రెడ్డి అవుతారని కెటిఆర్‌ హెచ్చరించారు. కొడంగల్‌లో రైతులకు సంబంధించిన భూముల కబ్జాల విషయాన్ని బయటకు తీసుకువచ్చినందుకే జర్నలిస్టు శంకర్‌పైన కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని పేర్కొన్నారు….రాజ్యాన్ని అడ్డుపెట్టుకొని, పోలీసులను అడ్డుపెట్టుకొని అంతమొందించాలన్న ఈ ప్రభుత్వ ప్రయత్నం అదృష్టవశాత్తు విఫలమైందని అన్నారు. భవిష్యత్తులో శంకర్ పైన దాడులకు తెగబడితే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. శంకర్‌పైన పకడ్బందీగా గత కొద్ది రోజులుగా రెక్కి నిర్వహించి మరీ పదుల సంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ గుండాలు ఆయనను అంతమొందించే ప్రయత్నం చేశారని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే స్థానికులు, సిసి కెమెరాల సాక్ష్యంగా ఉండడంతో వారి కుట్ర ఫలించలేదని పేర్కొన్నారు..