శిర్డీ సాయిబాబాకు వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని విరాళంగా ఇచ్చాడు ఓ వ్యాపారి.
ఇంగ్లాండ్కు చెందిన కనారి సుబారి పటేల్ అనే భక్తుడు ఈ కిరీటాన్ని సాయిబాబా ట్రస్టుకు అప్పగించారు.
సాధారణంగా సాయిబాబాకు ఎప్పుడూ బంగారు కిరీటాలు అందుతుంటాయి. అయితే ఈసారి బాబాకు పూర్తిగా వజ్రాలు పొదిగిన కిరీటం విరాళంగా వచ్చింది.
ఈ కిరీటం బరువు 368 గ్రాములు. దీని ధర రూ.28 లక్షలు ఉండొచ్చని చెబుతున్నారు. హారతి సమయంలో సాయిబాబాకు ఇలా కొత్త కిరీటాలు పెడుతుంటారు భక్తులు.