షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు హస్తం ఉంది: సజ్జల రామకృష్ణారెడ్డి..

*షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు హస్తం ఉంది: సజ్జల రామకృష్ణారెడ్డి*

షర్మిల వల్ల వైసీపీకి నష్టం లేదన్న సజ్జల

ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని వ్యాఖ్య

షర్మిలకు ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉందని వెల్లడి …

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. షర్మిల ప్రభావం వైసీపీ మీద ఎంత వరకు ఉంటుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని చెప్పారు. ఆమె కాంగ్రెస్ లో చేరడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని… ఆ పార్టీని తాము పట్టించుకోబోమని తెలిపారు. షర్మిలకు ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉందని అన్నారు.