శరవేగంగా షర్మిల అడుగులు!…

శరవేగంగా షర్మిల అడుగులు!


తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్న వైఎస్‌ షర్మిల. వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు. అటు సన్నిహితులతోనూ, ఇటు తెలంగాణ సమస్యలపైన, పాలనపైన అవగాహన ఉన్న వ్యక్తులతోనూ సమావేశమై చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్‌ అభిమానులతో షర్మిల శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. లోటస్‌పాండ్‌లో ఈ సమావేశానికి పలువురు ముఖ్య నాయకులు కూడా హజరు ఆయినట్లు తెలుస్తుంది…. ఇప్పటికే నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడిన షర్మిలకు వారందరి నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లు షర్మిల వర్గీయులు తెలుపుతున్నారు… అభిమానుల నుంచి ‘ఫీడ్ బ్యాక్’ తెలుసుకునేందుకు ఈ భేటీలు నిర్వహిస్తున్నారు.